IPL 2025: డాట్‌ బాల్‌కు మొక్కలు..! అసలు BCCI మొక్కలు ఎక్కడ నాటుతోంది? పూర్తి వివరాలు..

ఐపీఎల్‌లో ప్రతి డాట్ బాల్‌కు బీసీసీఐ 18 మొక్కలు నాటుతున్నట్లు ప్రకటించింది. 2023 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం టాటా గ్రూప్‌తో కలిసి చేపట్టబడుతోంది. ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్‌లో 1,47,000 మొక్కలు నాటబడ్డాయి. అయితే, ఈ మొక్కల నాటడం, సంరక్షణ గురించి పూర్తి వివరాలు బీసీసీఐ ఇంకా వెల్లడించలేదు.

IPL 2025: డాట్‌ బాల్‌కు మొక్కలు..! అసలు BCCI మొక్కలు ఎక్కడ నాటుతోంది? పూర్తి వివరాలు..
Jay Shah

Updated on: Apr 13, 2025 | 12:28 PM

ఐపీఎల్‌లో మ్యాచ్‌లు చూస్తున్న వారికి తెలిసే ఉంటుంది.. డాట్‌ బాల్‌ పడితే.. స్కోర్‌ బోర్డ్‌లో చెట్టు సింబల్‌ చూపిస్తున్నారు. అది ఎందుకంటే.. ప్రతి డాట్‌ బాల్‌కు బీసీసీఐ మొక్కలు నాటుతుంది. 2023 నుంచి ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టింది బీసీసీఐ. ఐపీఎల్‌ ప్రధాన స్పాన్సర్‌ టాటా గ్రూప్‌తో కలిసి బీసీసీఐ ఈ ఇన్సియేటివ్‌ తీసుకుంది. గతంలో ప్లే ఆఫ్స్‌లో మాత్రమే ప్రతి డాట్‌ బాల్‌కు 500 మొక్కలు నాటుతామని బీసీసీఐ ప్రకటించింది. అందుకు మంచి స్పందన రావడంతో.. డబ్ల్యూపీఎల్‌(ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌)లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఐపీఎల్‌ 2025లో ప్రతి డాట్‌ బాల్‌కు 18 మొక్కలు నాటుతామని వెల్లడించింది. ఐపీఎల్‌ 2024 ప్లే ఆఫ్స్‌లో నమోదైన డాట్‌ బాల్స్‌ను లెక్క గడితే.. మొత్తం 1,47,000 మొక్కలు నాటాలని లెక్కతేలింది.

ఇప్పుడు ఐపీఎల్‌ 2025లో ఇప్పటికే చాలా నో బాల్స్‌ నమోదు అయ్యాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లు కలిపితే.. ఓ 1800 పై చిలుకు డాట్‌ బాల్స్‌ నమోదు అయ్యాయ.. ప్రతి డాట్‌ బాల్‌కు 18 మొక్కలంటే.. 32 వేలకు పైగా మొక్కలు నాటాల్సింది ఉంది. సీజన్‌ పూర్తి అయ్యే సరికి ఈజీగా ఒక లక్ష దాటే అవకాశం ఉంది. ఇన్ని మొక్కలు నాటితే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది అని చాలా మంది సంతోషిస్తున్నారు. ఫోర్‌, సిక్స్‌ కొడితే క్రికెట్‌ లవర్స్‌ ఎంత ఆనందిస్తున్నారో.. డాట్‌ బాల్‌ పడితే నేచర్‌ లవర్స్‌ కూడా అంతకంటే ఎక్కువే సంతోషిస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ, అసలు బీసీసీఐ ఈ మొక్కలన్ని ఎక్కడ నాటుతుంది? గతంలో నాటిన మొక్కల సంరక్షణ ఎవరు చూస్తున్నారు? అవి బతికాయా? అసలు ఈ ఇవన్నీ కేవలం లెక్కల్లోనే ఉన్నాయా? నిజంగానే బీసీసీఐ మొక్కలు నాటుతుందా? అంటే.. సరైన ఆధారాలు అయితే ఇప్పటి వరకు బీసీసీఐ బయటపెట్టలేదు.

బెంగళూరులో కొత్త నిర్మించిన నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ, దాన్నే సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్ అని అంటున్నారు. అక్కడ ఓ 4 లక్షల మొక్కలు నాటినట్లు గతంలో బీసీసీఐ ఒక పోస్ట్‌ చేసింది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ మొక్క నాటుతున్నట్లు ఒక ఫొటో పెట్టింది. అలాగే కేరళ, గుజరాత్‌, అస్సాం వంటి రాష్ట్రాల్లో కూడా మొక్కలు నాటినట్లు తెలుస్తోంది. కానీ, కచ్చితంగా ఇగో ఈ ప్లేస్‌లో మొక్కలు నాటాం.. అని మాత్రం బీసీసీఐ చెప్పడం లేదు. మరి ఈ సీజన్‌ తర్వాత అయినా.. ఈ మంచి పనికి మరింత ప్రశంస దక్కాలంటే.. పూర్తి వివరాలు తెలియజేస్తే బాగుటుందని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..