IPL 2021: ఖాన్ వచ్చాడంటే రసెల్‌ ఔట్‌..! దుమ్ము లేపుతున్న సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేయర్‌..?

|

Apr 13, 2021 | 7:27 AM

Russell Fear of Rashid : సన్‌ రైజర్స్ ప్లేయర్ రషీద్‌ ఖాన్ బౌలింగ్‌కి దిగాడంటే.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు ఆండ్రీ రసెల్‌ ఔట్‌ అనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే రసెల్‌కు రషీద్‌ ఫియర్ పట్టుకుందని

IPL  2021: ఖాన్ వచ్చాడంటే రసెల్‌ ఔట్‌..! దుమ్ము లేపుతున్న సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేయర్‌..?
Russell Fear Of Rashid
Follow us on

Russell Fear of Rashid : సన్‌ రైజర్స్ ప్లేయర్ రషీద్‌ ఖాన్ బౌలింగ్‌కి దిగాడంటే.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు ఆండ్రీ రసెల్‌ ఔట్‌ అనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే రసెల్‌కు రషీద్‌ ఫియర్ పట్టుకుందని అంటున్నారు. నిన్న సన్‌ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా నైట్‌ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మళ్లీ అదే రిపీట్‌ జరిగింది. ఎప్పుడైతే రసెల్‌ క్రీజులోకి వచ్చాడో వెంటనే వార్నర్‌.. రషీద్‌ను రంగంలోకి దించాడు.16.1 బంతి రసెల్‌ లెగ్‌సైడ్‌ నుంచి బౌండరీకి వెళ్లింది. దాంతో వైడ్ల రూపంలో 5 పరుగులొచ్చాయి. ఆ తర్వాత రషీద్ రాంగ్‌ అన్‌ వేసి‌ పరుగు ఇవ్వలేదు. ఇక డిఫెన్స్‌ను ఛేదించేందుకు వచ్చిన రెండో బంతిని రసెల్‌ భారీ షాట్‌ ఆడాడు. లాంగ్‌ఆన్‌ మీదుగా గాల్లోకి లేచిన బంతిని మనీశ్‌ పాండే పరుగెత్తుకుంటూ వచ్చి ఒడిసిపట్టాడు. దీంతో రషీద్‌ మరోసారి రసెల్‌ను పెవిలియన్‌ పంపినట్టు అయింది.

రషీద్‌ ఖాన్‌. తన మిస్టరీ స్పిన్‌తో ఎంతో మంది బ్యాట్స్‌మన్లను ముప్పుతిప్పలు పెట్టాడు. జట్టుకు విజయాలు అందించాడు. అందుకే అలవోకగా పరుగులు చేసే ఎంతటి బ్యాట్స్‌మన్‌ అయినా అతడికి భయపడుతుంటారు. ఆచితూచి ఆడతారు. గత మ్యాచ్‌లు పరిశీలిస్తే రషీద్‌ బౌలింగ్‌లో రసెల్‌కు మెరుగైన రికార్డు లేదు. సిక్సర్లు బాదకుండా ఎవరినీ వదిలిపెట్టని అతడు ఈ అఫ్గాన్‌ వీరుడు వస్తే మాత్రం వణికిపోతాడు! ఎందుకంటే హైదరాబాద్‌తో తాజా మ్యాచ్‌కు ముందు టీ20 క్రికెట్లో అతడిని రషీద్‌ మూడుసార్లు ఔట్‌ చేశాడు. కేవలం 28 బంతులు విసిరి 48 పరుగులే ఇచ్చాడు. అందుకే ఆదివారం నాటి మ్యాచులోనూ 7, 9, 13 ఓవర్లు వేసిన అతడికి కెప్టెన్ వార్నర్‌ కాసేపటి వరకు బంతినివ్వలేదు.

బీసీ రిజర్వేషన్లను ఎలా నిర్ణయించారు.. వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

Ugadi 2021: ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీసులకు ఉగాది పురస్కారాలను ప్రకటించిన ఏపీ సర్కార్..

Bank holidays April 2021: బ్యాంక్ కస్టమర్స్ బీ ఎలర్ట్.. ఈ వారంలో ఎన్ని సెలవులు వచ్చాయంటే..!

Common Examination: ఎడ్‌సెట్‌ పరీక్ష విధానంలో ప్రభుత్వం మార్పులు.. సబ్జెక్టుల వారీగా ర్యాంకుల విధానం రద్దు