IND vs WI 4th T20I: టాస్ గెలిచిన విండీస్.. ఫ్లోరిడాలో హార్దిక్ సేనకు పంచ్ పడుతుందా.. ప్లేయింగ్ 11 ఇదే..
వెస్టిండీస్, భారత్ మధ్య ఇప్పటివరకు 8 టీ20 సిరీస్‌లు జరిగాయి. భారత్ 6, వెస్టిండీస్ 2 గెలిచాయి. వెస్టిండీస్ చివరిసారిగా 2017లో భారత్‌పై West Indies vs India 4th T20I Playing XI: సిరీస్‌ను ఓడించింది. ఆ తర్వాత వెస్టిండీస్‌లో ఒకే ఒక్క టీ20 ఆడగా, భారత్ ఓడిపోయింది. వెస్టిండీస్‌తో ఇప్పటివరకు మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఓడిపోలేదు. నేడు, వెస్టిండీస్ మ్యాచ్‌లో విజయం సాధించగలిగితే, ఆ జట్టు 2 కంటే ఎక్కువ మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలిసారిగా భారత్‌ను ఓడించినట్లవుతుంది.
West Indies vs India 4th T20I Playing XI: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా నేడు నాలుగో మ్యాచ్ జరగనుంది. అమెరికాలోని ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లోని క్రికెట్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. 5 టీ20ల సిరీస్‌లో కరేబీయన్ టీం 2-1తో ముందంజలో నిలిచింది. సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉన్న టీమిండియా.. సిరీస్‌లో సజీవంగా ఉండాలంటే నేటి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది. రేపు ఇదే నగరంలో 5వ మ్యాచ్ కూడా జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన విండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ముందుగా బౌలింగ్ చేయనుంది.
వెస్టిండీస్‌తో కేవలం 2 టీ20 సిరీస్‌లను మాత్రమే కోల్పోయిన భారత్..
వెస్టిండీస్, భారత్ మధ్య ఇప్పటివరకు 8 టీ20 సిరీస్‌లు జరిగాయి. భారత్ 6, వెస్టిండీస్ 2 గెలిచాయి. వెస్టిండీస్ చివరిసారిగా 2017లో భారత్‌పై సిరీస్‌ను ఓడించింది. ఆ తర్వాత వెస్టిండీస్‌లో ఒకే ఒక్క టీ20 ఆడగా, భారత్ ఓడిపోయింది.
బీసీసీఐ ట్వీట్..
4TH T20I. India XI: S Gill, Y Jaiswal, T Varma, S Yadav, S Samson(wk), H Pandya(c), A Patel, K Yadav, Y Chahal, A Singh, M Kumar. https://t.co/kOE4w9V1l0#WIvIND
వెస్టిండీస్‌తో ఇప్పటివరకు మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఓడిపోలేదు. నేడు, వెస్టిండీస్ మ్యాచ్‌లో విజయం సాధించగలిగితే, ఆ జట్టు 2 కంటే ఎక్కువ మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలిసారిగా భారత్‌ను ఓడించినట్లవుతుంది.
ఫ్లోరిడాలో ఇరు జట్ల మధ్య 6 టీ20లు జరగగా, భారత్ 4 గెలిచింది. వెస్టిండీస్ ఒక్కటి మాత్రమే గెలిచింది.
భారత్ 2016లో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 245 పరుగులకు ఆలౌటైంది. ఆఖరి బంతికి జట్టుకు 2 పరుగులు అవసరం కాగా, ఈ బంతికి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఔట్ కావడంతో టీమ్ ఇండియా ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ తర్వాత ఇక్కడ జరిగిన అన్ని టీ20ల్లోనూ భారత్ విజయం సాధించింది.