WI vs BAN, T20 World Cup 2021: 23వ మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 142 పరుగులు సాధించింది. దీంతో బంగ్లాదేశ్ ముందు 143 పరుగుల లక్ష్యం ఉంచింది. నికోలస్ పూరన్ 40(22 బంతులు, 1 ఫోర్, 4 సిక్సులు) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తరువాత తొలి మ్యాచ్ ఆడుతున్న రోస్టన్ ఛేజ్ 39(46 బంతులు, 2 ఫోర్లు) పరుగులతో నిలిచాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారభించిన వెస్టిండీస్ జట్టు గత రెండు మ్యాచుల్లానే పేలవమైన ప్రారంభంతో మొదలుపెట్టింది. ఓ దశలో 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ముస్తాఫిజుర్ రెహమాన్ ఖాతాలో ఎవిన్ లూయిస్ (6) వికెట్ పడింది. క్రిస్ గేల్ (4)ని మెహదీ హసన్ పెవిలియన్ చేర్చగా, షిమ్రాన్ హెట్మెయర్ (9)ని మెహ్దీ ఔట్ చేశాడు. రోస్టన్ చేజ్, కీరన్ పొలార్డ్‌ల జోడీ నాలుగో వికెట్‌కు 36 బంతుల్లో 30 పరుగులు జోడించారు. పొలార్డ్ అకస్మాత్తుగా రిటైర్డ్ హర్ట్ అయ్యి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అతను 18 బంతుల్లో 14 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఆండ్రీ రస్సెల్ 0 పరుగులకే రనౌట్ అయ్యాడు.
వెస్టిండీస్ తరఫున రోస్టన్ చేజ్ తన తొలి టీ20 మ్యాచ్‌ను ఆడుతున్నాడు. పవర్‌ప్లేలో వెస్టిండీస్ టీం 2 వికెట్ల నష్టానికి 29 పరుగులు మాత్రమే చేసింది. ఆండ్రీ రస్సెల్ టీ20లో 9వ సారి డకౌట్ అయ్యాడు.
ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 11 టీ20 మ్యాచులు జరిగాయి. ఇందులో వెస్టిండీస్ జట్టు 6, బంగ్లాదేశ్ టీం 5 మ్యాచుల్లో విజయం సాధించాయి.
మూడవ వరుస గేమ్‌లలో వెస్టిండీస్ టీం ఈ టోర్నమెంట్‌లో మొదట బ్యాటింగ్ చేసింది. మూడుసార్లు ఓడిపోయింది. వెస్టిండీస్ టీం భారతదేశంలో జరిగిన 2016 ప్రపంచకప్‌లో మొత్తం ఆరు గేమ్‌లలో టాస్ గెలిచి, ఛేజింగ్ చేసింది.
వెస్టిండీస్ ప్లేయింగ్ XI: క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్, రోస్టన్ చేజ్, నికోలస్ పూరన్(కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, జాసన్ హోల్డర్, డ్వేన్ బ్రేవో, అకేల్ హోసేన్, రవి రాంపాల్
బంగ్లాదేశ్ ప్లేయింగ్ XI: మహ్మద్ నయీమ్, లిటన్ దాస్(కీపర్), షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, సౌమ్య సర్కార్, మహ్మదుల్లా(కెప్టెన్), అఫీఫ్ హొస్సేన్, మహేదీ హసన్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్
Bangladesh restrict West Indies to 142/7 ?
Will they chase this target down? #T20WorldCup | #WIvBAN | https://t.co/WedSxcpLFz pic.twitter.com/fJQYnv7Brt
— ICC (@ICC) October 29, 2021
Also Read: IND vs NZ, T20 World Cup 2021: హార్దిక్ పాండ్యాకు ఫిట్‌నెస్ టెస్ట్.. కివీస్‌తో మ్యాచ్ ఆడేనా?
T20 World Cup 2021: బౌండరీలు బాదడంలో వీరి రూటే సపరేటు.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే?