IPL 2026: కేకేఆర్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. రిటైర్మెంట్ ప్రకటించిన డేంజరస్ ప్లేయర్.. కానీ,

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తదుపరి సీజన్‌కు ముందు, వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అతను ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. రస్సెల్ గత 12 సంవత్సరాలుగా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

IPL 2026: కేకేఆర్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. రిటైర్మెంట్ ప్రకటించిన డేంజరస్ ప్లేయర్.. కానీ,
Kkr 2026

Updated on: Nov 30, 2025 | 1:21 PM

వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. తన నిర్ణయాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పంచుకుంటూ, తాను మైదానాన్ని వీడుతున్నప్పటికీ, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కుటుంబంలో ఒకడిగా కొనసాగుతానని పేర్కొన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఇటీవల ఆండ్రీ రస్సెల్‌ను జట్టు నుంచి విడుదల చేసింది. అతను వేలంలోకి ప్రవేశిస్తాడని భావించారు. అయితే, అతను ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. కోచింగ్ సిబ్బందిలో కీలక పాత్ర పోషించనున్నాడు.

14 ఏళ్ల ఐపీఎల్ కెరీర్ ముగింపు..

రస్సెల్ 2012 లో ఢిల్లీ క్యాపిటల్స్ (అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్ ) తో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2014లో కేకేఆర్‌లో చేరాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 140 మ్యాచ్‌లు ఆడిన అతను అనూహ్యంగా రాణించాడు. ఈ కాలంలో, అతను 115 ఇన్నింగ్స్‌లలో 2651 పరుగులు చేశాడు. సగటు 28.20, స్ట్రైకింగ్ 174.17గా ఉంది. అతను బంతితో కూడా రాణించాడు. 121 ఇన్నింగ్స్‌లలో 123 వికెట్లు తీసుకున్నాడు. తన చివరి ఐపీఎల్ సీజన్‌లో, అతను 10 ఇన్నింగ్స్‌లలో 167 పరుగులు చేసి 8 వికెట్లు తీసుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..