ఐసీసీ వరల్ద్ కప్ 2019 ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా ధరించబోయే జెర్సీపై వివాదం నెలకొంది. ఈనెల 30న జరిగే ఈ మ్యాచ్‌లో భారత జట్టు నారింజ రంగు జెర్సీతో బరిలోకి దిగనుంది. వాస్తవంగా కోహ్లీసేన ఎప్పటినుంచో వాడుతున్న నీలిరంగు జెర్సీతోనే ప్రపంచకప్ లోనూ ఆడుతోంది. వరల్ద్ కప్ లో ఇంగ్లండ్ కూడా నీలిరంగు జెర్సీనే ధరిస్తోంది. అయితే ఆతిథ్య జట్టు కావడంతో 30న జరిగే మ్యాచ్‌లో టీమిండియా జెర్సీ రంగు మారనుంది. అయితే కోహ్లీసేన ధరించే జెర్సీ నారింజ రంగు కావడమే వివాదానికి కారణం. బీజేపీ జెండా కాషాయం.. నారింజ దాదాపు ఒకటే కావడంతో..టీమిండియా జెర్సీపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ అభ్యంతరాలు వ్యక్తంజేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని కాషాయీకరణ చేయాలని ప్రయత్నిస్తున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే నసీమ్ ఖాన్ ఆరోపించారు. ‘మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడా, సాంస్కృతిక రంగాల కాషాయీకరణ ప్రారంభమైంది’ అని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మద్దతు పలికింది. కాగా కాంగ్రెస్, ఎస్పీ ఆరోపణలను బీజేపీ కొట్టిపడేసింది. బీసీసీఐ ఇష్టప్రకారమే టీమిండియాకు నారింజ రంగు కేటాయించామని ఐసీసీ వివరించింది.
3️⃣ days until ??????? & ?? turn Edgbaston light blue for @UNICEF!#OneDay4Children pic.twitter.com/rBbhl0LHYM
— ICC (@ICC) June 27, 2019