India vs England: భారీ స్కోరుతో టీమ్‌ ఇండియాను చిరాకు పెడతాం.. 600-700 కొట్టేయడమే లక్ష్యమంటున్న ఇంగ్లాండ్ సారథి..

|

Feb 06, 2021 | 7:43 AM

India vs England: చెన్నైలో టీమ్ ఇండియాతో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో తొలి రోజు ఇంగ్లండ్‌ కెప్టెన్ జో రూట్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. అయితే మొదటి రోజు

India vs England: భారీ స్కోరుతో టీమ్‌ ఇండియాను చిరాకు పెడతాం.. 600-700 కొట్టేయడమే లక్ష్యమంటున్న ఇంగ్లాండ్ సారథి..
Follow us on

India vs England: చెన్నైలో టీమ్ ఇండియాతో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో తొలి రోజు ఇంగ్లండ్‌ కెప్టెన్ జో రూట్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. అయితే మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత జో రూట్ మీడియాతో పలు విషయాలు వెల్లడించాడు. వందో టెస్టులో శతకం సాధించడం ఆనందంగా ఉందని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్‌లో 600-700 పరుగులు చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. భారీ స్కోరుతో టీమ్‌ ఇండియాను చిరాకు పెడతామని చెప్పాడు. రెండో రోజు పూర్తిగా లేదా మూడో రోజు వరకు ఆడితే ఊపు అందుకోవచ్చు. అప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదంటూ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే శ్రీలంకతో పోలిస్తే భారత్‌ పరిస్థితులు కాస్త భిన్నమని రూట్‌ చెబుతున్నాడు. లంకలో బంతి కదలికలు, స్పిన్‌ కాస్త ఎక్కువగా ఉంటుందన్నాడు. మొదట స్పిన్నర్ల బౌలింగ్‌లో బౌన్స్‌ను, తర్వాత సీమర్ల బౌలింగ్‌ రివర్స్‌ స్వింగ్‌ను ఎదుర్కోవడం ఇబ్బందేనని వెల్లడించాడు. ఏదేమైనా భారీ పరుగులు చేసి జట్టును గెలిపించాలన్నదే తన లక్ష్యమని తెలిపాడు.

ఇలా ఆడితే ప్రపంచ కప్పు భారత్ గెలవడం కష్టమే… ఇంగ్లాడ్ మాజీ కెప్టెన్ విశ్లేషణ… ఆల్ రౌండర్లే అవసరం…