Video: వామ్మో.. ఇదేం డేంజరస్ బౌలింగ్‌ సిరాజ్ భయ్యా.. బ్యాట్ విసిరేసి, విలవిల్లాడిన ఆసీస్ బ్యాటర్.. వీడియో..

Mohammed Siraj: అప్పటికే ఒక వికెట్ తీసి ఫాంలో ఉన్న సిరాజ్.. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో మరోసారి రెచ్చిపోయాడు. దీంతో ఆస్ట్రేలియా బ్యాటర్‌కు దిమ్మతిరిగిపోయింది. అయితే, ప్రమాదం నుంచి బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Video: వామ్మో.. ఇదేం డేంజరస్ బౌలింగ్‌ సిరాజ్ భయ్యా.. బ్యాట్ విసిరేసి, విలవిల్లాడిన ఆసీస్ బ్యాటర్.. వీడియో..
Siraj Viral Video Wtc Final

Updated on: Jun 07, 2023 | 5:11 PM

WTC Final 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య ఓవల్ మైదానంలో జరుగుతోంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అంతకుముందు, బాలాసోర్ రైలు ప్రమాదంలో మృతులకు నివాళులు అర్పించేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లతో నివాళులర్పించారు.

టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియాకు సిరాజ్ తొలి దెబ్బ కొట్టాడు. ఉస్మాన్ ఖవాజాను పెవిలియన్ చేర్చాడు. అయితే, ఈ పిచ్‌లో పేసర్లకు అందుతున్న సహకారాన్ని సిరాజ్ అద్భుతంగా ఉపయోగించుకుని, తన బౌలింగ్‌తో ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అప్పటికే ఒక వికెట్ తీసి ఫాంలో ఉన్న సిరాజ్.. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో మరోసారి రెచ్చిపోయాడు. దీంతో ఆస్ట్రేలియా బ్యాటర్‌కు దిమ్మతిరిగిపోయింది. అయితే, ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

ఇవి కూడా చదవండి

ఇన్నింగ్స్ 8 వ ఓవర్ వేసేందుకు సిరాజ్ సిద్ధమయ్యాడు. క్రీజులో మార్నస్ లబుషెన్ ఉన్నాడు. అయితే, తొలి బంతిని 143 కి.మీ వేగంతో విసిరాడు. అయితే, ఇది అదనపు బౌన్స్, ఔట్ సీమ్‌గా రావడంతో మార్సన్ లబూషెన్ బిత్తరబోయాడు. వేగంగా చేతికి తాకడంతో బ్యాట్‌ను కిందపడేశాడు. అతని ఎడమ చేతి బొటన వేలికి దెబ్బ తగిలింది.

వెంటనే మైదానంలోకి ఫిజియో వచ్చి చెక్ చేసి, ఆయింట్ మెంట్ రాశాడు. దీంతో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మార్నస్ బ్యాటింగ్‌ చేసేందుకు ఓకే చెప్పాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇరు జట్లు:

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, శ్రీకర్ భరత్(కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.