Ashes Series: ఫాస్ట్ బౌలర్ స్పిన్ వెస్తే ఎలాగుంటదో తెలుసా.. వైరల్ అయిన వీడియో..

అడిలైడ్ ఓవల్‌లో జరుగుతున్న యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ మ్యాచ్‌లో 4వ రోజు అరుదైన ఘటన జరిగింది....

Ashes Series: ఫాస్ట్ బౌలర్ స్పిన్ వెస్తే ఎలాగుంటదో తెలుసా.. వైరల్ అయిన వీడియో..
Spin Bowling

Edited By:

Updated on: Dec 19, 2021 | 7:14 PM

అడిలైడ్ ఓవల్‌లో జరుగుతున్న యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ మ్యాచ్‌లో 4వ రోజు అరుదైన ఘటన జరిగింది. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఆలీ రాబిన్సన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేసి తమ జట్టును ఆశ్చర్యానికి గురి చేశాడు. సన్ గ్లాసెస్ ధరించి, లాంకీ పొడవాటి పేసర్ కొంచెం స్పిన్‌ను వేసి పిచ్ నుంచి బౌన్స్ రాబట్టగలిగాడు. పేసర్లు ఆఫ్-స్పిన్ వైపు మళ్లిన అరుదైన సందర్భంలో, రాబిన్సన్ ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నాడు. అతను ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుస్‌చాంగేకు రాబిన్సన్ బౌలింగ్ చేసి కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగుల వద్ద డిక్లెర్ చేసింది. రాబిన్సన్ 2 వికెట్లు పడగొట్టగా.. అండ్రూసన్, స్టువర్ట్ బ్రాడ్, రూట్, మలన్ తలో వికెట్ తీశారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో హెడ్ 51, లాబుస్‌చాంగే 51 పరుగులు చేశారు. 451 విజయ లక్ష్యంతో ఇంగ్లాండ్ బరిలో దిగనుంది. ఈ మ్యాచ్‎లో ఇంగ్లాండ్ గెలిస్తే సిరిస్ 1-1తో సమం అవుతుంది. ఆసీస్ గెలిస్తే సిరీస్ 2-1లీడ్‎లో ఉంటుంది.

Read Also.. Bigg Boss 5 Telugu Grand Finale Live: గ్రాండ్‌గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్.. స్టేజ్ పై సందడే.. సందడే

IND Vs SA: నెట్స్‎లో చెమటోడ్చిన భారత ఆటగాళ్లు.. వైరల్‎గా మారిన వీడియో..