Dhananjaya de Silva: దురదృష్టం చూడండి ఎలా వెంటాడిందో.. పాపం డి సిల్వా..

|

Nov 22, 2021 | 6:41 PM

క్రికెట్‌లో ఆటగాళ్లను కొన్నిసార్లు దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఊహించని విధంగా ఔట్ అవుతూ ఉంటారు. తాజాగా శ్రీలంక బ్యాటర్ ధనంజయ డిసిల్వా అనూహ్య రితీలో ఔటయ్యాడు.

Dhananjaya de Silva: దురదృష్టం చూడండి ఎలా వెంటాడిందో.. పాపం డి సిల్వా..
Dhananjaya De Silva
Follow us on

క్రికెట్‌లో ఆటగాళ్లను కొన్నిసార్లు దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఊహించని విధంగా ఔట్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు ప్లేయర్స్ పెవిలియన్‌కు చేరిన సందర్భాలను చూస్తే.. ఇలా కూడా ఔట్ అవుతారా అన్న సందేహం రాకమానదు. ఇలాంటి పాత వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా శ్రీలంక బ్యాటర్ ధనంజయ డిసిల్వా అనూహ్య రితీలో ఔటయ్యాడు. గాలే వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లో డిసిల్వా 61 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.  క్రీజ్‌లో కుదరుకుని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ గాబ్రియెల్ వేసిన 95వ ఓవర్‌లో.. సెకండ్ బాల్‌ను  డి సిల్వా ఢిపెన్స్‌ ఆడగా అది ఎడ్జ్‌ తీసుకుని స్టంప్స్‌ను తాకబోయింది.  ఈ క్రమంలో బాల్‌ను వికెట్లకు తగలకుండా  డి సిల్వా ఆపడానికి ట్రై చేశాడు. ఈ క్రమంలోనే  అనుకోకుండా అతని బ్యాట్‌ బెయిల్స్‌ని తాకడంతో అవి కిందపడ్డాయి. దీంతో ధనంజయ డి సిల్వా హిట్‌ వికెట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. కాగా టెస్టుల్లో  హిట్‌ వికెట్‌గా వెనుదిరగడం అతడికి ఇది సెకండ్ టైమ్ అవ్వడం మరో ఇంట్రస్టింగ్ విషయం. టెస్ట్‌ క్రికెట్‌లో రెండు సార్లు హిట్‌ వికెట్‌గా పెవిలియన్  చేరిన రెండో శ్రీలంక ప్లేయర్‌గా ధనంజయ డి సిల్వా నిలిచాడు. కాగా ఈ హిట్‌ వికెట్‌ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. బ్యాడ్ లక్ బ్రదర్ అంటూ ఒకరు కామెంట్ చేయగా.. మన ఫేట్ బాగాలేకపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుద్ది మరో నెటిజన్ రాసుకొచ్చాడు. సదరు వీడియోపై మీరూ ఓ లుక్కేయండి .

Also Read: ఉప్పొంగిన అభిమానం.. ఫోక్‌ సింగర్‌పై కరెన్సీ నోట్ల వర్షం.. ఏకంగా బకెట్లతో

Viral Video: కారులో వచ్చిన ఈ ఆంటీలు ఏం దొంగతనం చేశారో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్..