AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: వాటే ఎక్స్‌ప్రెషన్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న గంగూలీ వీడియో.. కోహ్లీ ఫ్యాన్స్‌ ఏమంటున్నారంటే..

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగాగం కోల్‌కత్తాలోని ఈడెన్‌ గార్డెన్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌(RCB), లక్నో సూపర్‌ జెయింట్స్‌(LSG) మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరిగింది.

IPL 2022: వాటే ఎక్స్‌ప్రెషన్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న గంగూలీ వీడియో.. కోహ్లీ ఫ్యాన్స్‌ ఏమంటున్నారంటే..
Ganguly
Srinivas Chekkilla
|

Updated on: May 26, 2022 | 12:41 PM

Share

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగాగం కోల్‌కత్తాలోని ఈడెన్‌ గార్డెన్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌(RCB), లక్నో సూపర్‌ జెయింట్స్‌(LSG) మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ను బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా కలిసి చూశారు. ఈ మ్యాచ్‌ సందర్భంగా గంగూలీ ఇచ్చిన ఒక ఎక్స్‌ప్రెషన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆ ఎక్స్‌ప్రెషన్‌ కూడా కోహ్లీ సంబంధించి కావడంతో ఈ వీడియో నెట్‌ హల్‌చల్‌ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బెంగళూరు బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా డుప్లెసిస్‌, విరాట్‌ కోహ్లీ వచ్చారు. డుప్లెసిస్ త్వరగా ఔటైనా.. కోహ్లీ కాసేపు క్రీజులో ఉన్నాడు. కోహ్లీ.. చమీర బౌలింగ్‌లో మిడ్‌ ఆన్‌లో ఫోర్‌ కొట్టాడు. అది చూసిన జై షా చప్పట్లు కొడుతూ పక్కనే ఉన్న గంగూలీని చూశాడు. అప్పుడు గంగూలీ చాలా డిఫరెంట్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడు. ఇప్పుడు ఇదే వైరల్‌ అవుతుంది.

ఈ మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ డకౌట్‌ కాగా విరాట్‌ కోహ్లీ 25 పరుగులు చేశాడు. రజత్‌ పాటిదార్‌ 112 పరుగులతో అజేయంగా నిలిచాడు. దినేష్‌ కార్తిక్‌ 37 పరుగులు చేశాడు. అనంతరం ఛేదనకు దిగిన లక్నో 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసి 14 పరుగుల తేడాతో ఓడిపోయింది. లక్నో కెప్టెన్‌ కెఎల్‌ రాహుల్‌ 79 పరుగులు చేయగా దీపక్‌ హుడా 47 పరుగులు చేశాడు. మిగతా వారు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.