
Salman Mirza Commits Fielding Howler at T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 సందడి మొదలైంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ టీం నెదర్లాండ్స్ తో తలపడింది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఫీల్డింగ్ ఏమాత్రం మారలేదని చూపిస్తోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
తొలి ఓవర్ నుంచే పాక్ జట్టు తేలిపోయినట్లు కనిపించింది. అటు బౌలింగ్, ఇటు ఫీల్డింగ్ చాలా పేలవంగా కనిపించింది. ఈ క్రమంలో యువ ఫాస్ట్ బౌలర్ సల్మాన్ మీర్జా చేసిన ఓ ఫీల్డింగ్ తప్పిదం అందరి దృష్టిని ఆకర్షించింది.
— crictalk (@crictalk7) February 7, 2026
నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ 8వ ఓవర్లో షాదాబ్ ఖాన్ స్కాట్ ఎడ్వర్డ్స్ కు బౌలింగ్ వేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. డచ్ కెప్టెన్ షార్ట్ థర్డ్ మ్యాన్ వైపు బంతిని పంపాడు. అయితే, బంతిని పట్టుకోవడానికి ప్రయత్నించిన మీర్జా.. దానిని తప్పుగా అంచనా వేసి, కంగుతిన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. బంతి మాత్రం ఈ యంగ్ పాక్ ఫీల్డర్ చేతికి చిక్కుండా బౌండరీకి దూసుకెళ్లింది. దీంతో నెదర్లాండ్స్‌కు ఊహించని విధంగా నాలుగు పరుగులు వచ్చాయి.
మీర్జా మిస్‌ఫీల్డ్ కారణంగా ఒక సింగిల్ గా మారాల్సిన బంతి బౌండరీగా మారింది. బంతిని ఛేజ్ చేసినప్పటికీ, దానిని ఆపడానికి అతనికి అవకాశం లేకపోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..