AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఒరే సామీ.. ఒంటి చేత్తే సిక్సులు బాదుడేంది.. 14 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో ఊచకోత.. వీడియో చూస్తే దడే

Spain Vs Czech Republic: ఈ వీడియో గత ఆదివారం అంటే ఫిబ్రవరి 18న చెక్ రిపబ్లిక్ వర్సెస్ స్పెయిన్ మధ్య జరిగిన మ్యాచ్‌కి సంబంధించినది. స్పెయిన్‌ తరపున 7వ ఓవర్‌లో బాబర్ తన చేతుల్లోని బలాన్ని చూపించాడు. మొదటి ఓవర్‌లో ఒక చేతితో షాట్ కొట్టలేకపోయాడు. అతను బౌండరీ లైన్ వెలుపల ఒకదాని తర్వాత మరొకటి సిక్సర్ల వర్షం కురిపించాడు. మైదానంలో బాబర్ సత్తా చూసి అభిమానులతో పాటు ఆటగాళ్లే కాదు వ్యాఖ్యాతలు సైతం ఆశ్చర్యపోయారు.

Video: ఒరే సామీ.. ఒంటి చేత్తే సిక్సులు బాదుడేంది.. 14 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో ఊచకోత.. వీడియో చూస్తే దడే
Muhammad Babar Video
Venkata Chari
|

Updated on: Feb 20, 2024 | 7:38 PM

Share

Muhammad Babar One Handed Six Video: రిషబ్ పంత్, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి పవర్ ఫుల్ బ్యాట్స్‌మెన్స్ ఒంటి చేత్తో భారీ సిక్సర్‌లు కొట్టడం ఎన్నో చూశాం. వీటిని చూసి అభిమానులు కూడా ఫుల్ జోష్‌లో కనిపిస్తుంటారు. తాజాగా స్పెయిన్‌కు చెందిన బాబర్ (Muhammad Babar) కూడా ఈ జాబితాలో చేర్చాడు. స్పెయిన్ డేంజరస్ బ్యాట్స్‌మెన్ ముహమ్మద్ బాబర్ గురించి మాట్లాడుతున్నాం. మీరు ఈరోజు వరకు ఈ ప్లేయర్ పేరు విని ఉండకపోవచ్చు. కానీ, ఇప్పుడు ఈ ప్లేయర్ వార్తల్లో నిలిచాడు.

ముహమ్మద్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో ఈ బ్యాట్స్‌మన్ కేవలం ఒంటి చేత్తో భారీ సిక్సర్లు కొట్టడం చూడొచ్చు. బాబర్ ఈ ఘనత ఒక్కసారే కాదండోయ్.. ఒంటి చేత్తో బ్యాట్ పట్టుకుని చాలా సులభంగా వరుసగా రెండు బంతుల్లో సిక్సర్లు కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడానికి కారణం ఇదే. క్రికెట్ అభిమానులు ఈ ప్లేయర్‌ను బాబర్ బాహుబలి అని పిలుస్తున్నారు.

ఈ వీడియో గత ఆదివారం అంటే ఫిబ్రవరి 18న చెక్ రిపబ్లిక్ వర్సెస్ స్పెయిన్ మధ్య జరిగిన మ్యాచ్‌కి సంబంధించినది. స్పెయిన్‌ తరపున 7వ ఓవర్‌లో బాబర్ తన చేతుల్లోని బలాన్ని చూపించాడు. మొదటి ఓవర్‌లో ఒక చేతితో షాట్ కొట్టలేకపోయాడు. అతను బౌండరీ లైన్ వెలుపల ఒకదాని తర్వాత మరొకటి సిక్సర్ల వర్షం కురిపించాడు. మైదానంలో బాబర్ సత్తా చూసి అభిమానులతో పాటు ఆటగాళ్లే కాదు వ్యాఖ్యాతలు సైతం ఆశ్చర్యపోయారు.

బాబర్ బాహుబలి వీడియో..

14 బంతుల్లో 74 పరుగులు..

ఈ మ్యాచ్‌లో, బాబర్ కేవలం 26 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ఆ సమయంలో అతను 5 ఫోర్లు, 9 సిక్సర్‌లు కొట్టాడు. అంటే కేవలం 14 బంతుల్లోనే సిక్సర్లు, ఫోర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. బాబర్‌ ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెక్‌ రిపబ్లిక్‌ నిర్దేశించిన 118 పరుగుల లక్ష్యాన్ని స్పెయిన్‌ కేవలం 7.1 ఓవర్లలోనే ఛేదించి సులువుగా విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..