6 sixes in 6 balls: 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టడం అంటే మామలు విషయం కాదు. ఇలాంటి మ్యాజిక్స్ అరుదుగా మాత్రమే జరుగుతుంటాయి. అసలు 6 బంతుల్లో 6 సిక్స్‌లు అనగానే మనకు గుర్తొచ్చేది.. ఒకప్పటి ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh). 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యూవీ చేసిన ఈ అద్భుతాన్ని ఊహించుకున్నా చాలు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఏమన్నా సిక్సులా అవి. బ్రాడ్ బౌలింగ్‌లో ఒక దాని వెంట ఒకటి.. ఒకదాని వెంట ఒకటి.. వరసగా స్టాండ్స్‌కి పంపించాడు. గ్రౌండ్‌లోని ఫీల్డర్లని కూడా వీక్షకులను చేశాడు. ఈ మ్యాజిక్ తాజాగా మరోసారి రిపీటయ్యింది. పుదుచ్చేరి(Puducherry) వేదికగా జరుగుతున్న టీ 10 లీగ్‌లో ఈ రేర్ ఫీట్ మరోసారి ఆవిష్కృతమైంది. ఓ యువ ఆటగాడు 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టి.. టీ 10 చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.
శనివారం రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 15 ఏళ్ల కృష్ణ పాండే మెరుపు షాట్లతో విరుచుకుపడ్డాడు. పేట్రియాట్స్ జట్టు ఇన్నింగ్స్ సమయంలో 6వ ఓవర్‌ను వేయడానికి బౌలర్ నితేష్ ఠాకూర్ వచ్చాడు. అతని పట్టపగలే చుక్కుల చూపించాడు కృష్ణ పాండే. గ్రౌండ్ నలువైపులా సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 19 బంతులు మాత్రమే ఆడిన కృష్ణ పాండే ఏకంగా 12 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మొత్తంగా 83 రన్స్ చేశాడు. కృష్ణ.. ఈ రేంజ్‌లో ఆడినప్పటికీ పేట్రియాట్స్ జట్టు ఈ మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో పరాజయం పాలయ్యింది. ప్రస్తుతం కృష్ణ పాండే ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣
He has done the unthinkable! #KrishnaPandey shows what’s possible with his heart-stirring hits!
Watch the Pondicherry T10 Highlights, exclusively on #FanCode ? https://t.co/GMKvSZqfrR pic.twitter.com/jfafcU8qRW
— FanCode (@FanCode) June 4, 2022