
ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో శుక్రవారం (అక్టోబర్ 31, 2025) జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ ఫీల్డింగ్‌లో అద్భుతం సృష్టించాడు. భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, తిలక్ వర్మ పట్టిన ఒక అద్భుతమైన బౌండరీ లైన్ క్యాచ్ హైలైట్‌గా నిలిచింది.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ (Travis Head) దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ భారత బౌలర్లపై ఒత్తిడి పెంచుతున్న సమయంలో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆసీస్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో.. ట్రావిస్ హెడ్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఆ బంతి నేరుగా బౌండరీ లైన్ వైపు వెళ్లింది.
అయితే, అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ వర్మ వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి, బౌండరీ లైన్‌కు అతి దగ్గరగా అమాంతం గాల్లోకి ఎగిరాడు. బంతిని అందుకున్న సమయంలో బౌండరీ లైన్‌ను దాటే ప్రమాదం ఉందని గ్రహించిన తిలక్, తన సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు.
తొలి అడుగు గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు. రెండో అడుగు తన శరీరం బౌండరీ లైన్ వెలుపల నేలను తాకేలోపే బంతిని చాకచక్యంగా గాల్లోకి విసిరాడు. ఇక మూడో అడుగు బౌండరీ లైన్ లోపలికి తిరిగి వచ్చి, గాల్లో తేలుతున్న బంతిని మళ్లీ ఒడుపుగా పట్టుకున్నాడు.
ఇలా బౌండరీకి దగ్గరగా అసాధారణ సమన్వయంతో తిలక్ వర్మ పట్టిన క్యాచ్‌ను చూసి ట్రావిస్ హెడ్ (28 పరుగులు) నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ క్యాచ్ సూర్యకుమార్ యాదవ్ గతంలో పట్టిన అద్భుత క్యాచ్‌ను గుర్తు చేసిందని క్రీడాభిమానులు, విశ్లేషకులు ప్రశంసించారు.
What a brilliant catch on the boundary from Tilak Varma! #AUSvIND pic.twitter.com/NdmTd6q2et
— cricket.com.au (@cricketcomau) October 31, 2025
తిలక్ వర్మ పట్టిన ఈ అద్భుతమైన క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. యువ క్రికెటర్ అథ్లెటిక్ నైపుణ్యం, ఫీల్డింగ్‌లో అతడి తెగువను ఈ క్యాచ్ స్పష్టం చేసింది. ఈ వికెట్ మ్యాచ్‌లో భారత్‌కు ఒక కీలక బ్రేక్ ఇచ్చింది.
అయితే, ఈ క్యాచ్ తర్వాత భారత్ వికెట్లు తీసినా, స్వల్ప స్కోరు (125 పరుగులు) కావడంతో ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయినప్పటికీ, తిలక్ వర్మ క్యాచ్ భారత ఫీల్డింగ్ ప్రమాణాలను మరోసారి చాటి చెప్పింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..