IPL Player Auction list : ఐపీఎల్‌-2021 వేలం జాబితా విడుదల.. యాక్షన్‌లో చోటు దక్కించుకున్న దేశీ ఆటగాళ్లు వీరే..

|

Feb 12, 2021 | 8:58 AM

IPL 2021 PLAYER AUCTION : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)-2021 వేలంకు రంగం సిద్దమైంది. ఈ నెల 18న చెన్నై వేదికగా నిర్వహించనున్న మినీ వేలం కోసం క్రికెటర్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది.

IPL Player Auction list : ఐపీఎల్‌-2021 వేలం జాబితా విడుదల.. యాక్షన్‌లో చోటు దక్కించుకున్న దేశీ ఆటగాళ్లు వీరే..
Follow us on

IPL-2021 Player Auction : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)-2021 వేలంకు రంగం సిద్దమైంది. ఈ నెల 18న చెన్నై వేదికగా నిర్వహించనున్న మినీ వేలం కోసం క్రికెటర్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. ఇందులో 1,114 మంది ఆటగాళ్లు పేరు నమోదు చేసుకోగా.. ఇందులో 292 మందికి మాత్రమే అనుమతి దక్కింది. వేలంలో మొత్తం 164 మంది భారత ఆటగాళ్లు, 125 మంది విదేశీ క్రికెటర్లు మాత్రంమే చోటు దక్కించుకున్నారు.

రూ.2 కోట్ల కనీస ధర జాబితాలో కేవలం ఇద్దరే ఇద్దరు దేశీ ఆటగాళ్లకు చోటు లభించగా.. ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి. ఇందులో హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్‌ను చేర్చారు. అలాగే మరో ఎనిమిది విదేశీ క్రికెటర్లను సైతం రూ.2కోట్ల బేస్‌ప్రైస్‌ జాబితాలో చేర్చారు. ఇందులో గ్లెన్‌ మాక్స్‌వెల్‌, స్టీవ్‌ స్మిత్‌, షకీబ్ అల్ హసన్, మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, లియామ్ ప్లంకెట్, జాసన్ రాయ్, మార్క్ వుడ్ ఉన్నారు.

ఇదిలా వుంటే.. రూ.1.5 బేస్‌ప్రైజ్‌ కేటగిరిలో 12 మందిని, రూ.కోటి కేటగిరిలో హనుమ విహారి, ఉమేశ్‌యాదవ్‌ సహా 11 మందిని చేర్చారు. అన్ని జట్లలో కలిసి 61 స్థానాలు ఖాళీగా ఉండగా.. అత్యధికంగా బెంగళూరు జట్టులో 13, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండ్కులర్‌ తనయుడు అర్జున్‌కు సైతం వేలంలో చోటు కల్పించారు.

VIVO IPL 2021 Player Auction list

ఇవి కూడా చదవండి :

Anasuya : పోస్టల్ స్టాంప్‌పై అన‌సూయ ఫొటో.. ఆశ్చర్యపోతున్న అభిమానులు.. కారణాలు ఇలా ఉన్నాయి..

Army Recruitment 2021: ఇండియన్ ఆర్మీ సిపాయి రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. డి.ఫార్మా, బి.ఫార్మా అర్హతతో నోటిఫికేషన్..

Kotia border dispute : మరోసారి ఏపీ, ఒడిశా మధ్య సరిహద్దు రచ్చ.. సుప్రీం కోర్టులో ఇవాళ విచారణకు రానున్న కొటియాల వివాదం