Sreesanth reacts : నా వయసు 38.. ఇప్పుడు కాకుంటే వచ్చే ఏడాది.. ఐపీఎల్ వేలంపై శ్రీశాంత్ రియాక్షన్

టీమిండియా వెటరన్ పేసర్ ఎస్ శ్రీశాంత్‌కు నిరాశే ఎదురైంది. బీసీసీఐ ప్రకటించిన తుది జాబితాలో తన పేరు లేకపోవడంపై శ్రీశాంత్‌..

Sreesanth reacts : నా వయసు 38.. ఇప్పుడు కాకుంటే వచ్చే ఏడాది.. ఐపీఎల్ వేలంపై శ్రీశాంత్ రియాక్షన్
Follow us

|

Updated on: Feb 12, 2021 | 3:33 PM

Sreesanth reacts : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL‌) 2021 కోసం ఈ నెల 18న చెన్నైలో నిర్వహించనున్న మినీ వేలం కోసం క్రికెటర్ల జాబితాను భారత క్రికెట్ మండలి (BCCI) గురువారం రాత్రి విడుదల చేసింది. మొత్తంగా 1114 మంది ఆటగాళ్లు పేరు నమోదు చేసుకోగా.. ఫ్రాంచైజీ యాజమాన్యాల సూచనల ప్రకారం 292 మందిని షార్ట్‌ లిస్ట్‌ చేశారు.

ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ చోటు దక్కించుకోగా.. స్పాట్‌ ఫిక్సింగ్ ఆరోపణలతో దాదాపు 7-8 ఏళ్లుగా క్రికెట్‌‌కు దూరమైన టీమిండియా వెటరన్ పేసర్ ఎస్ శ్రీశాంత్‌కు నిరాశే ఎదురైంది. బీసీసీఐ ప్రకటించిన తుది జాబితాలో తన పేరు లేకపోవడంపై శ్రీశాంత్‌ స్పందించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసిన శ్రీశాంత్‌ కాస్త భావోద్వేగం మాట్లాడుతూ…

‘ఐపీఎల్ 2021 కోసం బీసీసీఐ ప్రకటించిన తుది జాబితాలో నా పేరు లేకపోవడం బాధగా ఉన్నా.. దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా మరింత సానుకూలంగా ముందుకు సాగుతా. నాపై ప్రేమను చూపించిన అభిమానులకు కృతజ్ఞతలు. నాకింకా 38 ఏళ్లే. క్రికెట్‌ను అంత తేలిగ్గా వదలను. మరింత ఎక్కువగా కష్టపడి వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడేందుకు ప్రయత్నిస్తా’ అని శ్రీశాంత్‌ అన్నాడు.