విరాట్ కోహ్లీకి అండగా నిలిచిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్.. రెండో టెస్టులో విజయం అందించే సత్తా అతడికుందని కితాబు
టీం ఇండియా టెస్ట్ కెప్టెన్‌ను మార్చాలని వస్తున్న ఆరోపణలపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ స్పందించాడు. కోహ్లీని కెప్టెన్సీ
టీం ఇండియా టెస్ట్ కెప్టెన్‌ను మార్చాలని వస్తున్న ఆరోపణలపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ స్పందించాడు. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించవద్దని అతడికి రెండో టెస్ట్‌లో విజయం అందించే సత్తా ఉందని గుర్తుచేశాడు. కోహ్లీ సారథ్యంలో భారత్ గతంలో నాలుగు టెస్టుల్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అదే సమయంలో రహానె.. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలుపొందడంతో కోహ్లీ కెప్టెన్సీపై ఒత్తిడి పెరిగింది. మరోవైపు పలువురు క్రికెటర్లు, అభిమానుల నుంచి అతడిని కెప్టెన్‌గా తప్పించాలనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పీటర్సన్ ఓ క్రీడా వెబ్‌సైట్‌లో ఇలా పేర్కొన్నాడు.
‘ కోహ్లీ ఇప్పటికే నాలుగు టెస్టులు ఓడిపోయాడు. అదే సమయంలో రహానె ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించాడు. దీంతో సామాజిక మాధ్యమాలు, టీవీ, రేడియో ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతోంది. భారత్‌కు కెప్టెన్సీ చేయడం చాలా కష్టం. దురదృష్టం కొద్దీ ఇలాంటివి చోటుచేసుకుంటాయి. అయితే, రెండో టెస్టులో టీమ్‌ఇండియాకు విజయం అందించే సత్తా అతడికుందని’ మద్దతు పలికాడు. గతేడాది ఫిబ్రవరిలో టీమ్ ఇండియా న్యూజిలాండ్ పర్యటనలో రెండు టెస్టులు ఓడిన సంగతి తెలిసిందే. ఆపై ఆస్ట్రేలియాలో అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ టీమ్‌ఇండియా ఘోర పరాభవం పాలైంది. ఈ క్రమంలోనే తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులోనూ ఓటమి చవిచూసింది. వీటన్నింటికి కోహ్లీ సారథ్యం వహించిన సంగతి తెలిసిందే.
‘యూవీ ఎందుకంత క్యూట్‌గా ఉన్నావ్’ : కెవిన్ పీటర్సన్ క్రేజీ కామెంట్