Sachin Tendulkar: అసలు విషయం చెప్పేసిన సెహ్వాగ్.. సచిన్ గురించి ఎవరికీ తెలియని రహస్యమిదే..!

|

Mar 19, 2023 | 4:46 PM

క్రికెట్ కోసం దాదాపు 24 సంవత్సరాలకు పైగా తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం ఆషామాషీ విషయం అయితే కానేకాదు. దీని రహస్యమేమిటో తెలియని..

Sachin Tendulkar: అసలు విషయం చెప్పేసిన సెహ్వాగ్.. సచిన్ గురించి ఎవరికీ తెలియని రహస్యమిదే..!
Sachin Tendulkar And Virendra Sehwag
Follow us on

సచిన్ టెండూల్కర్.. క్రికెట్ చరిత్రలో చిరకాలం నిలిచిపోయే టీమిండియా మాజీ ఆటగాడి పేరు. మాస్టర్ బ్లాస్టర్.. క్రికెట్ లెజెండ్.. క్రికెట్ గాడ్‌గా క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన సచిన్ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్నెషనల్ క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా అరుదైన రికార్డు సచిన్ పేరిట మాత్రమే ఉంది. మైదానంలో సుదీర్ఘ కాలం పాటు తన కెరియర్‌ను కొనసాగించి పరుగుల వర్షం కురిపించి.. గుర్తుపెట్టుకోలేనన్ని రికార్డులు నెలకొల్పాడు. క్రికెట్ కోసం దాదాపు 24 సంవత్సరాలకు పైగా తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం ఆషామాషీ విషయం అయితే కానేకాదు. దీని రహస్యమేమిటో తెలియని ఎందరో క్రికెటర్లు.. తమకు వచ్చిన అవకాశాలను కూడా కాపాడుకోలేకపోతున్నారు. అయితే సచిన్ అంతకాలం పాటు తన ఫిట్‌నెస్‌ను ఎలా కాపాడుకోగలిగాడు..? అతని ఫిట్‌నెస్ రహస్యమేమిటి..? క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఫిట్‌నెస్ గురించి టీమిండియా మాజీ డాషింగ్ బ్యాట్స్‌మ్యాన్ వీరేందర్ సెహ్వాగ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

సచిన్ ఫిట్‌నెస్‌ గురించి సెహ్వాగ్ ఏమన్నాడో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో మాట్లాడిన సెహ్వాగ్.. ఆటలో మెరుగుదల కోసం సచిన్ నిరంతరం ఆలోచించే వాడని, అందుకు తగినట్లు కృషి చేసే వాడని తెలిపాడు. ఫిట్‌నెస్ విషయంలో విరాట్ కోహ్లీతో సచిన్ టెండూల్కర్ ఎప్పుడూ పోటీ పడేవాడని చెప్పాడు. ‘కావాలనుకుంటే సచిన్ ఇంకా కొన్నేళ్లు క్రికెట్ ఆడగలడని అందరూ ఎందుకు అనుకునే వారో తెలుసా..? తన బ్యాటింగ్‌ను ఎలా మెరుగుపరుచుకోవాలనే దానిపై సచిన్ ప్రతి ఏటా తన ఆటతీరును సమీక్షించుకునేవాడు. ఒకవేళ బ్యాటింగ్‌లో మార్చుకోవడానికి ఏమీ లేకపోతే.. సెంచరీలను డబుల్ సెంచరీలుగా మార్చేందుకు అవసరమైన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేవాడు’ అని సెహ్వాగ్ వివరించాడు. ఇంకా మాట్లాడుతూ ‘2000 నాటికి సచిన్.. అప్పటి జట్టులో ఉన్న మా అందరికంటే ఎక్కువగా ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టేవాడు. 2008 తర్వాత విరాట్ వచ్చాక.. అతడితో కూడా పోటీ పడ్డాడు సచిన్. నిజానికి ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీ కంటే సచిన్ ఎక్కువ ఫోకస్ పెట్టాడ’ని సెహ్వాగ్ వివరించాడు.

కాగా, 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు సచిన్ వీడ్కోలు పలికిన సచిన్ టెండూల్కర్.. 100 సెంచరీలు కొట్టిన ఏకైక క్రికెటర్‌గా నిలిచిపోయాడు. ఈ క్రమంలో సచిన్ 51 టెస్టు సెంచరీలు, 49 వన్డే శతకాలు సాధించాడు. ఇక పురుషుల వన్డే క్రికెట్‌లో తొలి ‘డబుల్ సెంచరీ’ సచిన్ చేసినదే. దాదాపు 24 ఏళ్ల తన క్రికెట్ కెరియర్‌లో 6 ప్రపంచ కప్‌లు ఆడాడు. అయితే చివరిగా తాను ఆడిన వరల్డ్ కప్ 2011లో టీమిండియా ట్రోఫీని అందుకోవడంతో పాటు.. దానిని సచిన్‌కు డెడికేట్ చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..