Sehwag Fan with Sachin: సచిన్‌ను టార్గెట్ చేసిన సెహ్వాగ్..’గాడ్ జీ’ సరదా వీడియోను పోస్ట్ చేసిన వీరు..

|

Mar 09, 2021 | 4:21 PM

Sehwag Gives Fans: వీరేంద్ర సెహ్వాగ్ .. టీమిండియా లెజెండ్స్ బ్యాట్స్‌మెన్ పరుగుల వరదకు కేరాఫ్ ఆడ్రస్.. అంతే కాదు హాస్యం పండించడంలోనూ తనకు తానే దిట్ట. మైదానంలోకి..

Sehwag Fan with Sachin: సచిన్‌ను టార్గెట్ చేసిన సెహ్వాగ్..గాడ్ జీ సరదా వీడియోను పోస్ట్ చేసిన వీరు..
Virender Sehwag Gives Fans with sachin
Follow us on

Sehwag Gives Fans with Sachin: వీరేంద్ర సెహ్వాగ్ .. టీమిండియా లెజెండ్స్ బ్యాట్స్‌మెన్ పరుగుల వరదకు కేరాఫ్ ఆడ్రస్.. అంతే కాదు హాస్యం పండించడంలోనూ తనకు తానే దిట్ట. మైదానంలోకి దిగితే ప్రత్యర్ధులకు చెమటలు పట్టించినట్లే.. తన సోషల్ మీడియా వేదికగా నవ్వులు పూయిస్తుంటారు. తాజాగా సచిన్‌, యువరాజ్‌ సింగ్‌తో కలిసి  కామెడీ పండించాడు.

రోడ్‌ సేఫ్టీ సిరీస్‌లో భాగంగా ఇండియా లెజెండ్స్‌ తరఫున ఆడుతూ సత్తా చాటుతున్నారు. దాంతో తమ అభిమానులకు మునుపటి రోజుల్ని గుర్తుకు తెస్తున్నారు. మంగళవారం ఇంగ్లాండ్‌ లెజెండ్స్‌తో ఇండియా లెజెండ్స్‌ రెడీ అవుతున్న సమందర్భంగా ఓ చిన్న సరదా వీడియోను చేశారు. ఈ క్రమంలోనే ఫిట్‌నెస్‌ ప్రక్రియలో భాగంగా సచిన్‌ తాజాగా తన ఎడమ మోచేతికి ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆక్యుపంచర్ సూదులు గుచ్చి డాక్టర్ పర్యవేక్షిస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు సెహ్వాగ్ బాబా‌.

సచిన్‌, యువీతో కలిసి సరదాగా జోకులు పేల్చాడు. వీడియోలో కామెంట్రీ చేస్తూ.. “ఈయన మన దేవుడు. క్రికెట్‌ ఆడీ ఆడీ చేతులమీద వెంట్రుకలు కూడా రాలేదు. ఇప్పుడు సూదులు గుచ్చుకొని తర్వాతి మ్యాచ్‌కు రెడీ అవుతున్నారు” అంటై కామెండీ పండించాడు.

అంతటితో ఆగకుండా.. సచిన్ పక్కనే కూర్చున్న యువరాజ్‌ సింగ్‌ను పలకరిస్తూ ‘మ్యాచ్‌కు సన్నద్ధమయ్యాడో లేదో తెలుసుకుందాం’ అని అడిగాడు. సెహ్వాగ్ అడిగిన ప్రశ్నకు యువీ తనదైన తరహాలో స్పందించాడు. ‘భాయ్‌ నువ్వు ఒక సింహం…. ఆయన (సచిన్‌) ఒక కొదమ సింహం’ అంటూ ముగించాడు.

ఆపై సెహ్వాగ్‌ మళ్లీ సచిన్‌ను మాట్లాడించాడు.. ‘సర్‌ మీ ప్రిపరేషన్ ఎలా ఉంది’ అని అడిగాడు. సచిన్‌ స్పందిస్తూ.. ‘నువ్వుండగా ఎవరికైనా ఆ అవకాశం ఉంటుందా?’ అని సరదాగా నవ్వేశాడు. దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. మళ్లీ వీరూ అందుకొని. ‘మీరు ఎక్స్‌పర్ట్‌ కదా.. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. మ్యాచ్‌కు సిద్ధమయ్యారా’ అని ప్రశ్నించాడు. సచిన్‌ సమాధానమిస్తూ ‘అందుకోసమే ప్రయత్నిస్తున్నా’ అని అన్నాడు. కాగా, ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇది చూసిన అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది

ఇక  టీమిండియా ఆట్‌టైమ్‌ అత్యుత్తమ ఓపెనర్ జోడీ‌ సచిన్‌ టెండుల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో కూడా రెచ్చి పోయారు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై చాలా కాలమైనా ఇంకా పరుగుల వరదను పారించారు. రోడ్‌ సేఫ్టీ సిరీస్‌లో భాగంగా ఇండియా లెజెండ్స్‌ తరఫున ఆడుతూ దూకుడు ప్రదర్శించారు. దాంతో తమ అభిమానులకు ఆ రోజుల్ని గుర్తుకు తెస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆదివారం బంగ్లాదేశ్‌ లెజెండ్స్‌ను చిత్తు చేసిన సెహ్వాగ్‌ 35 బంతుల్లో 80 పరుగులు చేయగా..  సచిన్ 26 బంతుల్లో 33 పరుగులు చేసి మంచి భాగస్వామ్యంను నెలకొల్పారు. మంగళవారం ఇంగ్లాండ్‌ లెజెండ్స్‌తో ఇండియా లెజెండ్స్‌ పోటీ పడుతున్నారు.

ఇవి కూడా చదవండి…

Incredible video shows: గగుర్పాటుకు గురిచేసిన వీడియో.. గాలానికి చిక్కిన చేపను మొసలి ఏం చేసిందో తెలుసా..

Platform Ticket: ప్లాట్‌ఫాం టిక్కెట్‌ ఉంటే మీరు రైలు ప్రయాణం చేయవచ్చు.. ఎలాగో తెలుసా…!

Dethadi Harika: దేత్తడి హారికకు భారీ షాక్.. టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ఆమె నియామక వివరాలు తొలగింపు