Virat Kohli Gym Workout Video: ఫిట్‌నెస్‌కు ప్రతి క్రీడాకారుడు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆటలో రాణించాలన్నా.. కెరీర్ విజయవంతంగా సాగించాలన్నా ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తాడు. వాస్తవానికి ఈ విషయంలో యువ ఆటగాళ్లు కూడా కోహ్లీని ఆదర్శంగా తీసుకుంటారు. ఫిట్‌నెస్ విషయంలో ఏ మాత్రం రాజీ పడని కోహ్లీ.. టైమ్ దొరికినప్పుడల్లా జిమ్‌లో గంటల తరబడి గడుపుతాడు. తాజాగా జిమ్‌లో కోహ్లీ వర్కౌట్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 10 గంటల్లో దాదాపు 20 లక్షల లైక్స్ సాధించింది.
ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్స్ తదుపరి ఐపీఎల్ మ్యాచ్‌లో ప్రత్యర్థులకు ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ చుక్కలు చూపించడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలోనూ తన జిమ్ వర్కౌట్స్‌కు సంబంధించిన పలు వీడియోలను కోహ్లీ ఇన్‌స్టాలో షేర్ చేశాడు.
టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు విరాట్ కోహ్లీ గత వారం ప్రకటించడం తెలిసిందే. అటు ఐపీఎల్‌లో వచ్చే సీజన్ నుంచి ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కెప్టెన్సీ బాధ్యతల కారణంగా ఏర్పడుతున్న ఒత్తిడి తన ఆటపై ప్రతికూల ప్రభావం చూపుతున్న కారణంగా కోహ్లీ ఈ నిర్ణయాలు తీసుకున్నారు. వన్డేల్లో మాత్రం టీమిండియాకు కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు క్రికెట్ కెరీర్‌ను విజయవంతంగా కొనసాగించేందుకే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడన్న చర్చ కూడా జరుగుతోంది.
Also Read..
Chicken Prices: హైదరాబాద్‌లో పెరిగిన చికెన్ ధరలు..! ఇంధన ధరలతో పోటా పోటీ