భారత్, దక్షిణాఫ్రికాతో మూడు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 26న భారత్, దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. ప్రతి జట్టు మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తుంది. సాధారణంగా జట్టు కెప్టెన్ ఈ విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తారు. అయితే తొలి టెస్టు మ్యాచ్‌కి ఒకరోజు ముందు డిసెంబర్ 25న జరగనున్న విలేకరుల సమావేశంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ విలేకరులతో మాట్లాడడం లేదు.
కోహ్లీ స్థానంలో జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వర్చువల్ విలేకరుల సమావేశంలో ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించి BCCI డిసెంబర్ 24న ఒక మెయిల్ జారీ చేసింది. సెంచూరియన్‌లో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌కు ముందు వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రసంగిస్తారని బీసీసీఐ మెయిల్‌లో రాసింది.
విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లే ముందు భారత్‌లో విలేకరుల సమావేశం నిర్వహించగా, ఈ సమావేశం తర్వాత భారత క్రికెట్‌లో వివాదం చెలరేగింది. టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నప్పుడు కోహ్లీని ఆపారని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ చేసిన ప్రకటనను కోహ్లీ తీవ్రంగా ఖండించాడు. కోహ్లీ వ్యాఖ్యలతో గంగూలీ కోపంగా ఉన్నాడు. మరుసటి రోజు, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ విలేకరుల సమావేశం కూడా నిర్వహించారు.
Read Also..IND vs SA: రాహుల్ ద్రవిడ్ సలహాతోనే మళ్లీ వచ్చాను.. దక్షిణాఫ్రికాతో టెస్ట్ కోసం ఎదురు చూస్తున్నాను..