Indian Cricketers: సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్న భారత క్రికెటర్లు.. ఒక్క పోస్ట్ తోనే కోట్ల ఆదాయం..

| Edited By: Surya Kala

Dec 01, 2023 | 3:36 PM

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందింది. దీనితో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు. అభిమానులతో అనేక విషయాలని పంచుకుంటున్నారు. తమకు సంబంధించిన ఫోటోలను, అప్డేట్స్ ని అందిస్తున్నారు. ఛారిటీలతో పాటు తమకు నచ్చిన మెసేజ్ లని అభిమానులకు అందిస్తున్నారు. ఇక కొంతమంది ప్లేయర్లు అయితే.. పేయిడ్ పార్ట్నర్షిప్ అంటూ.. ఆయా సంస్థలని ప్రమోట్ చేస్తూ..  కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక్కో పోస్ట్ కి ఇంతా అంటూ ఛార్జ్ చేసే వాళ్లు ఉన్నారు.

Indian Cricketers: సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్న భారత క్రికెటర్లు.. ఒక్క పోస్ట్ తోనే కోట్ల ఆదాయం..
Indian Cricketers
Follow us on

స్పోర్ట్స్ తో పాటు సోషల్ మీడియాలోనూ స్టార్లుగా మారిపోతున్నారు మన క్రికెటర్లు. సోషల్ మీడియాకి దూరంగా ఉండే సీనియర్స్ సైతం.. యంగ్ స్టర్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ..  అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. మిలియన్స్ కొద్దీ ఫాలోవర్స్ ని సంపాదించుకుంటున్నారు. దీంతో తమకు సంబంధించిన ఫోటోలని అప్డేట్ చేస్తుండటంతో పాటు.. తమ అభిమానులకు మెసేజ్ లు ఇస్తున్నారు. సోషల్ మీడియా యాక్టీవ్ గా ఉంటూ..  కోట్ల రూపాయలన్ని సంపాదిస్తున్నారు కూడా.

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందింది. దీనితో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు. అభిమానులతో అనేక విషయాలని పంచుకుంటున్నారు. తమకు సంబంధించిన ఫోటోలను, అప్డేట్స్ ని అందిస్తున్నారు. ఛారిటీలతో పాటు తమకు నచ్చిన మెసేజ్ లని అభిమానులకు అందిస్తున్నారు. ఇక కొంతమంది ప్లేయర్లు అయితే.. పేయిడ్ పార్ట్నర్షిప్ అంటూ.. ఆయా సంస్థలని ప్రమోట్ చేస్తూ..  కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక్కో పోస్ట్ కి ఇంతా అంటూ ఛార్జ్ చేసే వాళ్లు ఉన్నారు.

విరాట్ కొహ్లీ క్రికెట్ తో పాటు సోషల్ మీడియాలోను ఎన్నోరికార్డ్స్ ని బద్దలు కొడుతున్నాడు. సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారిలో విరాట్ కోహ్లీ నెంబర్ వన్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీకి ఫేస్ బుక్ లో 51 మిలియన్, ట్విట్టర్ లో 57.9 మిలియన్, ఇన్ స్టాగ్రామ్ లో 259 మిలియన్ కలిపి మొత్తం.. 367.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ద్వారా విరాట్ సంపాదిస్తుంది ఐదు కోట్ల పైనే.

ఇవి కూడా చదవండి

ఎంఎస్ ధోని కెప్టెన్ కూల్ గా ఎన్నో అద్భుతమైన మ్యాచ్ లు ఆడాడు. చక్కటి కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడు. మహేంద్రసింగ్ ధోని మంచి ఫినిషర్ గా కూడా పేరు పొందాడు. ఇక మహేంద్ర సింగ్ ధోనీకి 45.5 మిలియన్ల మంది ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవుతుంటే.. ఫేస్ బుక్ లో 27 మిలియన్స్, ట్విట్టర్ లో 8.6 మిలియన్స్ ఫాలో అవుతున్నారు. క్రికెట్ కి గుడ్ బై చెప్పినా.. ధోని క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇన్ స్టాగ్రామ్ లో రోజురోజుకి ఫాలోవర్స్ ని పెంచుకుంటూనే ఉన్న ఎమ్.ఎస్.డి..  ఇన్స్టాలో ఒక్క పోస్ట్ ద్వారా ఒక కోటి 44 లక్షలు సంపాదిస్తున్నాడు.

రోహిత్ శర్మ ఆట తీరు ఎంతో అద్భుతంగా ఉంటుంది. హిట్ మ్యాన్ అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. సోషల్ మీడియాలో 72.2 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో 30.1 మిలియన్ల మంది ఫాలో అవుతుంటే.. ఫేస్బుక్ లో 20 మిలియన్స్, ట్విట్టర్ లో 22.2 మిలియన్స్ ఫాలో అవుతున్నారు. ట్విట్టర్లో 20.1 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ఇక రోహిత్ శర్మ ఇన్ స్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ ద్వారా.. దాదాపు 76 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.

హార్దిక్ పాండ్య ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా 65 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇక బ్యాటింగ్ మాస్ట్రో సచిన్ టెండూల్కర్ ఆఖరి మ్యాచ్ 2013లో ఆడాడు. సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన సంగతి తెలిసిందే. సచిన్ టెండూల్కర్ కి సోషల్ మీడియాలో 163 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో 42.7 మిలియన్స్, ఫేస్ బుక్ లో 38 మిలియన్, ట్విట్టర్ లో 83 మంది ఫాలోవర్స్ ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..