India vs England: రెండో టెస్ట్ గెలుపులో అభిమానులదే కీలక పాత్ర అని చెబుతున్నాడు టీమ్ ఇండియా సారథి విరాట్ కోహ్లీ.. మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. బంతి బౌన్స్ అవ్వడంపై మేమేం భయపడలేదని, ఆటలో మా ధైర్యాన్ని, తెగువను ప్రదర్శించామని అన్నాడు. 600 పరుగులు సాధిస్తే మా బౌలర్లు మిగిలిన పనిని పూర్తిచేస్తారని ముందే ఊహించామన్నాడు. ఈ సందర్భంగా చెపాక్ పిచ్‌పై వస్తున్న విమర్శలను ఖండించాడు. ఇక్కడ టాస్ కీలకం అనుకోవట్లేదని, స్పిన్/సీమ్ ట్రాక్‌పై తొలి సెషన్ నుంచే ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉండాలని ఇక్కడ అదే జరిగిందని పేర్కొన్నాడు.
ఈ విజయంతో భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసిందని గుర్తుచేశాడు. రెండో టెస్టులో మేము అంత కసిగా ఆడటానికి కారణం అభిమానులే అని తెలిపారు.అలాగే బ్యాటింగ్‌తో పాటు వికెట్‌కీపింగ్‌లో సత్తాచాటిన రిషభ్ పంత్‌ను కొనియాడాడు. పంత్ ఆస్ట్రేలియాలో ఎంతో శ్రమించాడని, అతడు వికెట్ కీపింగ్‌లో మార్పులు మీరు గమనించే ఉంటారని చెప్పాడు. అంతేగాక అతడు బరువు తగ్గాడని, టర్న్, బౌన్స్ అవుతున్నా వికెట్ల వెనుక మంచి ప్రదర్శన చేశాడని పొగిడాడు.