Virat Kohli: తగ్గేదే లే అంటున్న విరాట్ కోహ్లీ.. వైరల్‌గా మారిన వీడియో..

|

Mar 07, 2022 | 3:16 PM

ఏమంటూ పుష్ప (Pushpa) సినిమాలో అల్లు అర్జున్‌ (Allu Arjun) ‘తగ్గేదేలే’ అన్న డైలాగ్‌ చెప్పాడో కానీ ఈ సినిమా క్రేజ్‌ మాత్రం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు...

Virat Kohli: తగ్గేదే లే అంటున్న విరాట్ కోహ్లీ.. వైరల్‌గా మారిన వీడియో..
Virat Kohli
Follow us on

ఏమంటూ పుష్ప (Pushpa) సినిమాలో అల్లు అర్జున్‌ (Allu Arjun) ‘తగ్గేదేలే’ అన్న డైలాగ్‌ చెప్పాడో కానీ ఈ సినిమా క్రేజ్‌ మాత్రం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. బహుశా ఒక తెలుగు సినిమాకు ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో క్రేజ్‌ దక్కడం ఇదే తొలిసారి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాలీవుడ్‌ నుంచి మొదలు కోలివుడ్ వరకు దేశమంతా పుష్ప మేనియా కొనసాగుతోంది. సినిమా విడుదలై నెలలు గడుస్తోన్నా ఇప్పటికీ పుష్ప ట్రెండింగ్‌లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్‌లు, పాటలకు చేస్తున్న రీల్స్‌ నెట్టింట సందడి చేస్తూనే ఉన్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా పుష్ప మాయలో పడిపోయారా అన్నట్లు కనిపిస్తోంది. చివరికి క్రికెటర్లకు కూడా పుష్ప ఫీవర్‌ అంటుకుంది. ఇతర దేశాల క్రికెటర్స్‌ కూడా పుష్ప పాటలకు, డైలాగ్‌లకు రీల్స్‌ చేస్తుండడం విశేషం. ఇలాంటి ఎన్నో వీడియోలు రోజూ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇప్పుడు కోహ్లీ(Virat Kohli) కూడా తగ్గేదేలే అంటున్నాడు.

మొహాలీలో మూడు రోజుల్లో ముగిసిన భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్టు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రత్యేకమైంది. అతను భారత్ తరఫున 100 టెస్టులు ఆడిన 12వ భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా టెస్ట్ క్రికెట్‌లో 8,000 పరుగులు చేశాడు. 8,000 టెస్టు పరుగులు చేసిన ఆరో భారత బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్.. బెంగళూరులో రెండో టెస్టు ఆడనుంది. అయితే మొహాలీ టెస్టులో భారత్ ఒక్క ఇన్నింగ్స్‌లో మాత్రమే బ్యాటింగ్ చేసినా.. మైదానంలో కోహ్లీ తన హవాభావాలతో అలరించాడు.

ఆదివారం మ్యాచ్‌ జరుగుతుండగా విరాట్ కోహ్లీ పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌లా తగ్గేదేలే అంటూ గడ్డం కిందికెళ్లి చేయి పైకి లేపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. కోహ్లీ మొదటి ఇన్నింగ్స్‌లో 45 పరుగులు చేశాడు. కోహ్లీ 2011లో తన టెస్ట్ అరంగేట్రం చేశాడు.50కి పైగా సగటుతో 8,007 పరుగులు సాధించాడు.

Read Also.. Ricky Ponting: షేన్ వార్న్‌ను గుర్తు చేసుకుంటూ ఏడ్చిన రికీ పాంటింగ్.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..