
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ 1258 రోజులు నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. బాబర్ ఆజం అతని స్థానాన్ని అధిగమించడంతో కోహ్లీ రికార్డు స్ట్రీక్ ముగిసింది. ఆ సమయంలో కేవలం రెండు రోజులు ఆలస్యంగా ఈ మార్పు జరిగి ఉంటే, కోహ్లీ ఆస్ట్రేలియా ఆటగాడు మైఖేల్ బెవన్‌ను అధిగమించి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఎక్కువకాలం నంబర్ వన్‌గా ఉన్న రెండో బ్యాటర్‌గా నిలిచేవాడు.
ఇది చదవండి: ‘ఆ సినిమా పూర్తయ్యాక.. తారక్.! నాలుగేళ్లు నీ మొహం ఇక చూపించకు అన్నాడు..’
వివరాల్లోకి వెళ్తే.. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ సుదీర్ఘకాలం పాటు అగ్రస్థానంలో కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడైతే పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజామ్ రైజ్ మొదలైందో.. అతడు నెంబర్ వన్ స్థానాన్ని అధిగమించడంతో.. కోహ్లీ 1258 రోజుల నెంబర్ వన్ ర్యాంక్ స్ట్రీక్ ముగిసింది. అయితే, ఈ మార్పు కేవలం రెండు రోజులు ఆలస్యంగా జరిగి ఉంటే, విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకునేవాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మైఖేల్ బెవన్.. కోహ్లీ కన్నా ముందు వరుసలో ఏకంగా 1259 రోజుల పాటు నెంబర్ వన్ వన్డే బ్యాట్స్‌మెన్‌గా కొనసాగాడు. కోహ్లీ మరో రెండు రోజులు అగ్రస్థానంలో నిలిచి ఉంటే, అతను మైఖేల్ బెవన్‌ను అధిగమించి ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉండేవాడు. కానీ బాబర్ ఆజామ్ వల్ల అది సాధ్యం కాలేదు. ఈ జాబితాలో మొదటి స్థానంలో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ సర్ వివ్ రిచర్డ్స్ ఉన్నారు. ఆయన ఏకంగా 1748 రోజుల పాటు ఐసీసీ నెంబర్ వన్ వన్డే బ్యాట్స్‌మెన్‌గా నిలిచి ఎవరికీ అందని విధంగా అద్భుతమైన రికార్డును నెలకొల్పారు. విరాట్ కోహ్లీ, బాబర్ ఆజామ్, మైఖేల్ బెవన్ లాంటి ఆటగాళ్లతో పాటు, సర్ వివ్ రిచర్డ్స్ కూడా వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్లలో ఒకరిగా నిలిచారు.
ఇది చదవండి: అప్పులు కాదు.. మీ ఇంటి నిండా డబ్బులే.! ఈ 8 సూత్రాలు పాటిస్తే మీరే కోటీశ్వరులు..