IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే రెండో మ్యాచ్ టీమిండియాకు ఎంతో కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌లో టీమిండియా నిలిచి ఉంటుంది. ఓడిపోతే మాత్రం సిరీస్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కూడా రెండు రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఒకవైపు సిరీస్‌లో నిలవాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలవాల్సిన అవసరం ఉన్న చోట, మరోవైపు ఈ మ్యాచ్‌లో విరాట్ ఈ మ్యాచ్‌లో ఉన్న రికార్డులపై కన్నేశాడు.
తొలి మ్యాచ్‌లో బ్యాట్‌తో విఫలమైన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో 21 పరుగులు చేస్తే.. బంగ్లాదేశ్ గడ్డపై 1,000 పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం శ్రీలంక వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర ఈ రికార్డును కలిగి ఉన్నాడు. సంగక్కర 1,045 పరుగులతో ఉండగా, కోహ్లీ 75.30 సగటు, 99.59 స్ట్రైక్ రేట్‌తో 979 పరుగులు చేశాడు. 1,000 పరుగుల మార్క్‌కు కేవలం 21 పరుగుల దూరంలో ఉన్నాడు.
ఇక రెండో రికార్డు గురించి మాట్లాడితే.. సెంచరీల పరంగా ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్‌ను అధిగమించే అవకాశం విరాట్‌కు ఉంది.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ పేరిట 71 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. ఈ విషయంలో అతను రికీ పాంటింగ్‌తో సమానంగా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో విరాట్ సెంచరీ సాధించగలిగితే, అతను పాంటింగ్ కంటే ముందుకు వెళ్తాడు. అంతర్జాతీయ సెంచరీల జాబితాలో సచిన్ తర్వాత రెండవ నంబర్‌కు చేరుకుంటాడు. పాంటింగ్ మూడవ స్థానానికి పడిపోతాడు.
కోహ్లి బ్యాటింగ్ గురించి మాట్లాడితే.. ఆసియా కప్ తర్వాత అతను మంచి ఫాంలో ఉన్నాడు. ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అతను తన 71వ సెంచరీని సాధించాడు. ఆ మ్యాచ్‌లో అతను 61 బంతుల్లో 122 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత ప్రపంచకప్‌లో పరుగులు చేయడంలో నంబర్‌వన్‌గా నిలిచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..