Virat Kohli: టీమ్ ఇండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి డ్యాన్స్ నేర్పుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఐపీఎల్ టీమ్ ఆర్‌సీబీ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పంచుకుంది. ఇందులో ధనశ్రీ వర్మ, విరాట్ కోహ్లీకి డ్యాన్స్ నేర్పుతున్నట్లు చూడొచ్చు.
ఆర్‌సీబీ హుక్ స్టెప్ ఛాలెంజ్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో, చాహల్ భార్య ధనశ్రీ, విరాట్ కోహ్లీకి హుక్ స్టెప్ నేర్పించడంలో సహాయం చేసింది. దీని వీడియో సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. విరాట్‌కి ధనశ్రీ ఈ స్టెప్ ఎలా నేర్పిందో వీడియోలో చూడొచ్చు.
డాన్సర్ ధనశ్రీ..
ధనశ్రీ వర్మకు డ్యాన్స్‌కు సంబంధించిన యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఈ ఛానెల్‌కు 25 లక్షల కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. ధన్శ్రీ బాలీవుడ్ పాటలను రీక్రియేట్ చేస్తూ నెట్టింట్ల సందడి చేస్తుంది. ఇది కాకుండా, ఆమె హిప్-హాప్‌లో శిక్షణ కూడా ఇస్తుంది. ధనశ్రీ 2014లో డివై పాటిల్ డెంటల్ కాలేజ్ నవీ ముంబైలో విద్యను అభ్యసించింది.
క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధన్శ్రీ వర్మ తమ అందమైన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ టచ్‌లో ఉంటారు. వీరిద్దరు డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.