virat Kohli is the greatest cricketer: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పశంసలతో ముంచెత్తాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా సిరీస్‌లో ఉన్న భారత జట్టును ఉద్ధేశించి కెప్టెన్ లేకపోతే ఇండియా గెలవడం కష్టమని తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు. కోహ్లీ ఒక్కసారి సెంచరీ కొడితే వరుసగా నాలుగైదు మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధిస్తాడని ఆకాశానికెత్తాడు. ఇండియాలో విరాట్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని చెప్పాడు.
అంతేకాకుండా అతడి బ్యాటింగ్ స్టయిల్ అంటే తన కుమారుడికి ఎంతగానో ఇష్టమని తెలిపాడు. ఇండియా మ్యాచ్ వస్తున్నప్పుడు తను ఒకవేళ పడుకుంటే కోహ్లీ బ్యాటింగ్‌కు రాగానే నిద్రలేపమని కోరేవాడని చెప్పుకొచ్చాడు. మళ్లీ అతడు ఒౌటయ్యాక తన గదిలోకి వెళ్లిపోయేవాడని గుర్తు చేశాడు. కోహ్లీ ఈ దశాబ్ధంలోనే గొప్ప ఆటగాడని అతడు ఆడే సులువైన షాట్లు తనను మైమరపిస్తాయని పొగడ్తల వర్షం కురిపించాడు. జట్టు సభ్యులతో అతడు వ్యవహరించే తీరు, నడవడిక, ఓపిక అన్ని బాగుంటాయని వివరించాడు. అయితే కోహ్లీ ఏడాది కాలంగా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. గతేడాది బంగ్లాదేశ్‌తో ఆడిన చివరి టెస్ట్‌లో అతడు మూడంకెల స్కోర్ చేశాడు. గత రెండు వన్డేలలో కూడా చెప్పుకో తగిన ప్రతిభ కనబరచలేదు. అభిమానులు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. చివరి మ్యాచ్‌లోనైనా సత్తా చూపుతాడోనని వేచి చూస్తున్నారు.