
Virat Kohli: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. గత ఐదు వన్డే ఇన్నింగ్స్‌ల్లో వరుసగా హాఫ్ సెంచరీలు లేదా సెంచరీలు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పుడు భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే రాజ్‌కోట్ వేదికగా జరగనుంది. అయితే, గత 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో కోహ్లీకి రాజ్‌కోట్‌లో ఒక వింత రికార్డు ఉంది. వన్డేల్లో సెంచరీల మీద సెంచరీలు బాదే కింగ్ కోహ్లీ, రాజ్‌కోట్ మైదానంలో మాత్రం ఇప్పటివరకు ఒక్క వన్డే సెంచరీ కూడా సాధించలేకపోయాడు.
రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో విరాట్ కోహ్లీకి అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. కానీ అది కేవలం హాఫ్ సెంచరీల వరకే పరిమితమైంది.
మొత్తం మ్యాచ్‌లు: 5
నిరంజన్ షా స్టేడియంలో: 4 మ్యాచ్‌ల్లో 56.5 సగటుతో 226 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
మాధవరావు సింధియా గ్రౌండ్‌లో: 2009లో ఆడిన ఒక మ్యాచ్‌లో 27 పరుగులకే అవుట్ అయ్యాడు.
అత్యధిక స్కోరు: 78 పరుగులు.
ఈ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించినప్పటికీ, మూడంకెల స్కోరు (సెంచరీ) మాత్రం ఆయనకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
ప్రస్తుతం కోహ్లీ ఫామ్ చూస్తుంటే రాజ్‌కోట్‌లో సెంచరీ కరువు తీరుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. గత ఐదు వన్డేల్లో కోహ్లీ 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఒకవేళ రాజ్‌కోట్‌లో కూడా 50 ప్లస్ స్కోరు సాధిస్తే, వన్డేల్లో వరుసగా ఆరు ఇన్నింగ్స్‌ల్లో 50+ పరుగులు చేసిన తొలి భారతీయ బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డులో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మలతో కలిసి కోహ్లీ సమానంగా ఉన్నాడు.
వడోదర వన్డేలో 93 పరుగులతో రాణించిన కోహ్లీ, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరువయ్యాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ నంబర్ 1 స్థానంలో ఉండగా, రాజ్‌కోట్ వన్డేలో కోహ్లీ మరో భారీ ఇన్నింగ్స్ ఆడితే దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్ళీ ప్రపంచ నంబర్ 1 వన్డే బ్యాటర్‌గా నిలుస్తాడు.
వడోదరలో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించిన టీమ్ ఇండియా, ఇప్పుడు రాజ్‌కోట్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. విరాట్ కోహ్లీ తన 17 ఏళ్ల రాజ్‌కోట్ సెంచరీ నిరీక్షణకు తెరదించుతాడో లేదో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..