World Cup 2023, Virat Kohli: దాదాపు 12 ఏళ్ల తర్వాత క్రికెట్ కార్నివల్ భారత గడ్డపై జరగబోతుంది. అంతకముందు 2011 వరల్డ్‌కప్ భారత్ సహా శ్రీలంక, బంగ్లాదేశ్ సంయుక్త వేదికగా జరగ్గా.. ఈ సారి 2023 ప్రపంచకప్ పూర్తిగా భారత్‌లోనే జరగబోతోంది. ఇది భారత్‌లో జరుగుతున్న రెండో ప్రపంచకప్ కాగా, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి నాల్గో టోర్నీ. 2011, 2015, 2019 వరల్డ్ కప్‌లో ఆడిన విరాట్‌కి ఇప్పుడు జరగబోయే 2023 ప్రపంచ కప్ చివరి మెగా టోర్నీ అన్న ప్రచారం జరుగుతోంది. అయితే కోహ్లీపై జరుగుతున్న ప్రచారాలపై అతని చిరకాల మిత్రుడు, మాజీ టీమ్‌మేట్(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) అయిన క్రిస్ గేల్ స్పందించాడు. కోహ్లీ కెరీర్ గురించి యూనివర్సల్ బాస్ ఏమన్నాడంటే..
‘విరాట్ కోహ్లీకి ఇదే చివరి ప్రపంచ కప్ అని నేను అనుకోను, అతను మరో వరల్డ్‌కప్ టోర్నీ ఆడగలడు. అందుకు కావాల్సిన సత్తా అతనిలో ఉంది. స్వదేశంలో ఆడుతున్న టీమిండియా నా ఫేవరేట్. టోర్నీ కోసం వారు ఎంపియ చేయబోయే జట్టును చూడాలని ఎదురుచూస్తున్నా’ అని గేల్ అన్నాడు.
కాగా, భారత్ వేదికగా జరగబోయే ఈ 2023 వన్డే ప్రపంచకప్.. అక్టోబర్ 5నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ తొలి మ్యాచ్, మెగా ఫైనల్‌కి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది. ఇక ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఇక టీమిండియా విషయానికి వస్తే అక్టోబర్ 8న తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో బరిలోకి దిగుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..