Video: తొలి కప్పు గెలిపించిన కెప్టెన్‌ రజత్‌ పటిదార్‌కు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన విరాట్‌ కోహ్లీ!

ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన ఆర్సీబీ జట్టులో కెప్టెన్ రజత్ పటీదార్ కీలక పాత్ర పోషించాడు. ఈ విజయానికి గుర్తు గా విరాట్ కోహ్లీ తన బ్యాట్‌ను పటీదార్‌ కు బహుమతిగా ఇచ్చాడు.

Video: తొలి కప్పు గెలిపించిన కెప్టెన్‌ రజత్‌ పటిదార్‌కు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన విరాట్‌ కోహ్లీ!
Kohli And Rajat

Updated on: Jun 04, 2025 | 11:26 AM

17 ఏళ్ల నిరీక్షణ తర్వాత.. ఫైనల్‌గా 18వ సీజన్‌లో ఆర్సీబీ తొలి ఐపీఎల్‌ ట్రోఫీని గెలిచింది. ఐపీఎల్‌ 2025లో భాగంగా మంగళవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌ తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లు ముఖ్యంగా విరాట్‌ కోహ్లీ తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. కోహ్లీ అయితే చివరి ఓవర్‌లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. 18 ఏళ్లుకే అదే టీమ్‌కు ఆడుతూ.. 17 ఏళ్లుగా ట్రోఫీ లేదనే విమర్శలు ఎదుర్కొంటూ కూడా ఆర్సీబీలోనే కొనసాగి.. ఇప్పుడు 18వ ఎడిషన్‌లో ట్రోఫీ గెలవడంతో కోహ్లీ చాలా ఎమోషనల్‌ అయ్యాడు.

ఆర్సీబీకి కోహ్లీనే చాలా కాలం కెప్టెన్‌గా ఉన్నాడు, అతనితో పాటు చాలా మంది ఆర్సీబీకి కెప్టెన్సీ చేశారు. కానీ, ఏ ఒక్కరు కూడా ఆర్సీబీకి కప్పు అందించలేకపోయారు. కానీ, ఒక్కడు ఒకే ఒక్కడు.. యంగ్‌ కెప్టెనగా వచ్చి, కెప్టెన్సీ చేసిన తొలి సీజన్‌లోనే జట్టును అద్భుతంగా నడిపించి.. ఆర్సీబీకి తొలి ఐపీఎల్‌ ట్రోఫీని అందించాడు. ఆర్సీబీ సాధించిన ఈ విజయంలో కెప్టెన్‌ రజత్‌ పటిదార్‌ కీలక పాత్ర పోషించాడు. అందుకే ఆ జట్టుకు పెద్ద దిక్కైన విరాట్‌ కోహ్లీ.. తన కలను నిజం చేసిన తన కెప్టెన్‌కు ఒక అరుదైన బహుమతిని ఇచ్చాడు. తన బ్యాట్‌ను తానే స్వయంగా రజత్‌కు ఇచ్చాడు.

ఇప్పటి వరకు ఎవరైనా అడిగితేనే తన బ్యాట్‌ను ఇచ్చిన కోహ్లీ.. తొలిసారి తానే స్వయంగా పటిదార్‌కు తన బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. కోహ్లీ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌కు రజత్‌ ఫిదా అయిపోయాడు. కోహ్లీ బ్యాట్‌ను ముద్దాడుతూ.. తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియా మొత్తం ఆర్సీబీ సెలబ్రేషన్స్‌తో నిండిపోయింది. ఇప్పుడు అందులో కోహ్లీ రజత్‌కు బ్యా్‌ గిఫ్ట్‌కు ఇచ్చిన వీడియో కూడా చేరిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..