Virat Kohli: సమంత పాటకు కోహ్లీ ఊర మాస్ స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

|

Apr 28, 2022 | 1:48 PM

క్రికెట్‌ మైదానంలో ఎంతో దూకుడుగా కనిపించే విరాట్ కోహ్లీ (Virat Kohli) బయట కూడా అంతే సరదాగా ఉంటాడు. పార్టీలు, ఫంక్షన్లలో తోటి ఆటగాళ్లతో చిల్‌ అవుతూ కనిపిస్తుంటాడు.

Virat Kohli: సమంత పాటకు కోహ్లీ ఊర మాస్ స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..
Virat Kohli
Follow us on

క్రికెట్‌ మైదానంలో ఎంతో దూకుడుగా కనిపించే విరాట్ కోహ్లీ (Virat Kohli) బయట కూడా అంతే సరదాగా ఉంటాడు. పార్టీలు, ఫంక్షన్లలో తోటి ఆటగాళ్లతో చిల్‌ అవుతూ కనిపిస్తుంటాడు. అప్పుడప్పుడు డ్యాన్స్‌ కూడా చేస్తూ ఫ్యాన్స్‌కు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంటాడు. అలా తాజాగా మరోసారి కాలు కదిపాడు ఈ రన్నింగ్ మెషిన్‌. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమాలో సమంత (Samantha) స్పెషల్ సాంగ్‌ ‘ఊ అంటావా.. మావా’ పాటకు ఉత్సాహంగా స్టెప్పులేశాడు. అతనితో పాటు షాబాజ్‌ అహ్మద్‌, అనుజ్‌ రావత్, ఫిన్‌ అలెన్‌ తదితర రాయల్ ఛాలెంజర్స్‌ ఆటగాళ్లు కూడా ఈ పాటకు డ్యాన్స్‌ వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఐపీఎల్‌కు ముందుకు ఆర్‌సీబీ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ తన ప్రియురాలు భారత సంతతికి చెందిన వినీరామన్‌తో ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తాజాగా బెంగళూరు జట్టు సభ్యులందరికీ గ్రాండ్‌గా పార్టీ ఇచ్చాడీ స్టార్‌ ప్లేయర్‌. ఇందులో ఆర్సీబీ క్రికెటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో పార్టీకి హాజరయ్యారు కోహ్లీ- అనుష్కాశర్మ. ఇక ఐపీఎల్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు విరాట్‌. లీగ్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన అతను 16 సగటుతో కేవలం 128 పరుగులు మాత్రమే చేశాడు. రాజస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఓపెనింగ్ లో వచ్చినప్పటికీ పెద్దగా పరుగులు సాధించలేకపోయాడు. ఈక్రమంలో అతను త్వరగా ఫామ్‌లోకి రావాలని, మునపటిలా మళ్లీ పరుగుల వరద పారించాలి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఆర్సీబీ విషయానికొస్తే.. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పది పాయింట్లతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. కాగా డుప్లెసిస్‌ తన తదుపరి మ్యాచ్‌లో పటిష్ఠమైన గుజరాత్ టైటాన్స్‌ తో తలపడనుంది. శనివారం (ఏప్రిల్ 30) మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

మరిన్నీ క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

Health Tips: మీరు రోజుకి ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేస్తున్నారు.. ఒక్కసారి ఈ విషయాలు గమనించండి..!

IPL 2022: ఐపీఎల్ టోర్నీలో అత్యధిక సార్లు డకౌటైన విదేశీ ఆటగాళ్లు వీరే.. లిస్టులో ఆ టాప్‌ ప్లేయర్‌ కూడా..

Elon Musk – India: ఎలాన్ మస్క్ లక్ష్యం నెరవేరుతుందా..? భారత్‌లో అపరిమిత స్వేచ్ఛ సాధ్యమేనా?