Virat Kohli: టెస్ట్ కెప్టెన్సీకి రోహిత్ శర్మ సరైనోడు.. విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Jan 29, 2022 | 8:25 PM

దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు...

Virat Kohli: టెస్ట్ కెప్టెన్సీకి రోహిత్ శర్మ సరైనోడు.. విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Rohith Sharma
Follow us on

దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ దీనిపై స్పందించారు. విరాట్ కెప్టెన్సీని విడిచిపెట్టినప్పటి నుంచి భారత తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరు అనేది ఇంకా తేలలేదు. రాజ్‌కుమార్ ఇప్పుడు రోహిత్ శర్మకు మద్దతు ఇచ్చాడు. అయితే టెస్ట్ కెప్టెన్సీ రేసులో రోహిత్‌తో టు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ పేర్లు ఉన్నాయి.

విరాట్ టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో సెలక్టర్లు అతడిని వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఆ తర్వాత వన్డే, టీ20 జట్లకు రోహిత్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇప్పుడు టెస్టు కెప్టెన్సీ రేసులో అతని పేరు ముందు వరుసలో ఉంది. న్యూస్ ఛానెల్ ఇండియా న్యూస్‌తో రాజ్‌కుమార్ మాట్లాడుతూ, టెస్టు జట్టు కెప్టెన్సీకి రోహిత్ తప్ప మరొక అభ్యర్థి లేరని అన్నాడు. “రోహిత్ శర్మ తప్ప వేరే అభ్యర్థి ఎవరూ లేరు, ఎందుకంటే అతను మూడు ఫార్మాట్లలో స్థిరమైన స్థానాన్ని కలిగి ఉన్న ఆటగాడు. కాబట్టి అతను మంచి ఎంపిక అని నేను భావిస్తున్నాను. అతను ఐపిఎల్‌లో కెప్టెన్‌గా చేశాడు.

వెస్టిండీస్‌తో జరిగిన టీమ్ ఇండియా ఎంపిక గురించి కూడా రాజ్‌కుమార్ మాట్లాడారు. కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ఒకే ఆలోచనతో పనిచేయడం జట్టుకు అవసరమని కూడా అన్నాడు. “ప్రతి కెప్టెన్ తన సొంత ఎంపికను కలిగి ఉంటాడు. ప్రతి కెప్టెన్ తనకు నచ్చిన ఆటగాడిని పొందాలని కోరుకుంటాడు. ఇది సాధారణంగా జరిగేది. రోహిత్‌, రాహుల్‌ ద్రవిడ్‌ ఒకే వేదికపై ఉంటే అది మరింత సులువవుతుంది.” అని రాజ్ కుమార్ అన్నాడు.

Read Also.. Virat Kohli: విరాట్ కోహ్లీ వికెట్ అత్యంత ఇష్టం.. వారిని ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాలని ఉంది..