Team India: ‘ద్రవిడ్ తేల్చేశాడు.. అందుకే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించారు”..

|

Dec 10, 2021 | 11:54 AM

Team India: గత కొద్దిరోజులుగా టీమిండియా క్రికెట్‌లో జరుగుతున్న పరిణామాలు అటు ఫ్యాన్స్‌ను.. ఇటు మాజీ ప్లేయర్స్‌ను షాక్‌కు...

Team India: ద్రవిడ్ తేల్చేశాడు.. అందుకే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించారు..
Virat Kohli
Follow us on

గత కొద్దిరోజులుగా టీమిండియా క్రికెట్‌లో జరుగుతున్న పరిణామాలు అటు ఫ్యాన్స్‌ను.. ఇటు మాజీ ప్లేయర్స్‌ను షాక్‌కు గురి చేస్తున్నాయి. టీ20లకు, వన్డేలకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమిస్తూ ఇటీవలే బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా అర్ధాంతరంగా కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంపై నెటిజన్లు బీసీసీఐపై ఫైరవుతున్నారు. ఈ నేపధ్యంలోనే భారత మాజీ ఆటగాడు సాబా కరీం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

”కోహ్లీ ఉద్వాసనకు గురయ్యాడు. నిజం చెప్పాలంటే.. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీ.. వన్డేలకు కెప్టెన్‌గా కొనసాగుతాడని భావించాను. కానీ బీసీసీఐ నుంచి ఈ షాకింగ్ ప్రకటన ఊహించలేదు. వన్డే కెప్టెన్‌గా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా తన ఖాతాలో లేకపోవడమే వన్డేల్లో కోహ్లీ కెప్టెన్సీ వేటుకు ప్రధాన కారణం” అని సాబా కరీం పేర్కొన్నాడు. కాగా, ఈ అంశంపై టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కోహ్లీతో సంప్రదింపులు జరిపి ఉంటాడు. ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తుది నిర్ణయం తీసుకుని ఉంటారని సాబా కరీం తెలిపాడు. అటు టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని కోహ్లీ నిర్ణయం తీసుకునప్పుడు.. బీసీసీఐ రోహిత్ శర్మను పూర్తిస్థాయి టీ20 కెప్టెన్‌గా నియమించిన విషయం విదితమే.

Also Read: సోఫాలో నుంచి వింత శబ్దాలు.. భయం భయంగా పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే!