Virat Kohli: వివాదంలో విరాట్ కోహ్లీ.. జాతీయ గీతాలాపన చేస్తుంటే చూయింగ్ గమ్.. ఫైరవుతున్న నెటిజన్లు..

|

Jan 24, 2022 | 8:41 AM

Virat Kohli: జాతీయ గీతం జనగణమన(Jana Gana Mana) ఆలపిస్తుండగా విరాట్ కోహ్లీ(Virat Kohli) వ్యవహరించిన నిర్లక్ష్యపు ధోరణికి ఫ్యాన్స్ తీవ్రంగా హార్ట్ అయ్యారు. అతడు చేసిన పనికి..

Virat Kohli: వివాదంలో విరాట్ కోహ్లీ.. జాతీయ గీతాలాపన చేస్తుంటే చూయింగ్ గమ్.. ఫైరవుతున్న నెటిజన్లు..
Virat Kohli
Follow us on

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ మధ్య ఏదీ సరిగ్గా కలిసి రావట్లేదు. వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. తాజాగా సౌతాఫ్రికా(South Africa)తో మూడో వన్డేకు ముందు జాతీయ గీతం జనగణమన(Jana Gana Mana) ఆలపిస్తుండగా విరాట్ కోహ్లీ వ్యవహరించిన నిర్లక్ష్యపు ధోరణికి ఫ్యాన్స్ తీవ్రంగా హార్ట్ అయ్యారు. అతడు చేసిన పనికి నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. మూడో వన్డే ఆరంభానికి ముందు జట్టులోని మిగతా ప్లేయర్స్ అందరూ శ్రద్దగా జాతీయ గీతాన్ని ఆలపిస్తుండగా.. కోహ్లీ(Virat Kohli) మాత్రం ఎలాంటి పట్టింపు లేకుండా చూయింగ్ గమ్ నములుతూ కనిపించాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా కోహ్లీ ఇలా అనుచితంగా ప్రవర్తించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆన్ ఫీల్డ్‌లో ప్రవర్తించే తీరు ఎలా ఉన్నా ఫర్వాలేదు గానీ.. జాతీయ గీతం ఆలపించేటప్పుడు మాత్రం ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని కామెంట్స్ చేస్తూ నెటిజన్లు కోహ్లీపై ఫైరవుతున్నారు. దేశం కోసం ఆడటం ఇష్టం లేకపోతే తప్పుకోవాలని విమర్శిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

కాగా, టీమిండియా కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన దగ్గర నుంచి విరాట్ కోహ్లీ ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. ఆన్ ఫీల్డ్‌లో కోహ్లీ దూకుడుగా కనిపించడం లేదని అతడి ఫ్యాన్స్ అంటున్నారు. అతడి పట్ల బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణం అని చెబుతున్నారు. ఇదిలా ఉంటే టీ20 వరల్డ్ కప్ 2021 అనంతరం పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. ఇక దక్షిణాఫ్రికా టూర్‌కు ముందు ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదనే ఉద్దేశ్యంతో కోహ్లీ దగ్గర నుంచి వన్డే కెప్టెన్సీని లాక్కుంది బీసీసీఐ. ఇక సఫారీల చేతుల్లో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న విరాట్ కోహ్లీ ప్రకటించిన సంగతి విదితమే.