వరల్డ్ కప్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గతంలో స్టీవ్ స్మిత్ చేసిన బాల్ ట్యాంపరింగ్ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత అభిమానులు చీటర్.. చీటర్.. అంటూ మ్యాచ్‌లో అతడ్ని టీజ్ చేశారు. కాస్త హద్దుమీరి ప్రవర్తించారు. దాన్ని గమనించిన కోహ్లీ.. అలా ప్రవర్తించవద్దంటూ భారత అభిమానులను మందలించాడు. చప్పట్లు కొట్టి అతడ్ని ప్రోత్సహించాలని సైగ చేశాడు. అటుగా వచ్చిన స్మిత్‌తో.. అభిమానుల తరఫున క్షమించు అని అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ‘జరిగిందేదో జరిగిపోయింది. అతను రీ ఎంట్రీ చేశాడు. ఐపీఎల్‌లో సైతం స్మిత్‌ను ఇలా గేలి చేయడం చూశా. ఒకరిని కించపరస్తూ ఇలా గేలిచేయడం అంత మంచిది కాదు. మా అభిమానుల తరఫున మైదానంలోనే అతన్ని క్షమాపణలు కోరాను’ అని కోహ్లి చెప్పాడు. కాగా, అభిమానులను కోహ్లి మందలించడాన్ని చూసిన స్మిత్.. అభినందన పూర్వకంగా అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి, భుజం తట్టాడు.
With India fans giving Steve Smith a tough time fielding in the deep, @imVkohli suggested they applaud the Australian instead.
Absolute class ? #SpiritOfCricket #ViratKohli pic.twitter.com/mmkLoedxjr
— ICC (@ICC) June 9, 2019
“If I was in a position where something had happened with me, and I’d apologised and accepted it, and came back and still I would get booed, I wouldn’t like it either.”#ViratKohli on why he asked the fans to stop booing Steve Smith. #CWC19 | #INDvAUS pic.twitter.com/CIMicjoSA0
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019