BCCI Central Contract: ఇకపై రోహిత్, కోహ్లీ ‘బీ గ్రేడ్’ ప్లేయర్స్.. ఆ లిస్ట్‌తో షాకిచ్చిన బీసీసీఐ..

BCCI Annual Player Retainership 2025 26 List: బీసీసీఐ తాజాగా విడుదల చేసిన వార్షిక ఆటగాళ్ల కాంట్రాక్టుల లిస్ట్‌లో రోహిత్ శర్మతోపాటు విరాట్ కోహ్లీకి షాకిచ్చింది. ఈ జాబితాలో ఈ ఇద్దరు దిగ్గజాలను 'గ్రేడ్ బీ'కి తగ్గించింది. అయితే, సాయి సుదర్శన్‌ను కొత్తగా చేర్చారు.

BCCI Central Contract: ఇకపై రోహిత్, కోహ్లీ బీ గ్రేడ్ ప్లేయర్స్.. ఆ లిస్ట్‌తో షాకిచ్చిన బీసీసీఐ..
Rohit Virat

Updated on: Feb 09, 2026 | 8:38 PM

BCCI Annual Player Retainership 2025 26 List: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2025-26 సీజన్ (అక్టోబర్ 1, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు) కోసం టీమిండియా సీనియర్ పురుషులు, సీనియర్ మహిళల వార్షిక ఆటగాళ్ల కాంట్రాక్టులను ప్రకటించింది. 2025-26 సంవత్సరానికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ‘గ్రేడ్ బీ’కి తగ్గించారు. ఈ మేరకు ఇప్పటికే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకటించిన లిస్ట్ తో ఈ విషయం తేటతెల్లమైంది.

ఈ లిస్ట్‌లో టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు మాత్రమే ఏ గ్రేడ్‌లో ఉన్నారు.

గ్రేడ్ బీలో రోహిత్, కోహ్లీతోపాటు వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, సిరాజ్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు.

ఇక గ్రేడ్ సీలో అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివం దుబే, సంజూ శాంసన్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, ధృవ్ జురేల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..