Ind vs Ban 1st ODI: బంగ్లాతో తొలి వన్డే మ్యాచ్ కోసం సన్నద్ధమవుతోన్న రోహిత్ సేన..

|

Dec 04, 2022 | 2:18 PM

భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో తన పర్యటనలో భాగంగా ఈ రోజు(ఆదివారం) మొదటి వన్డే మ్యాచ్‌ను ఆడబోతోంది. ఈ మేరకు బంగ్లా రాజధాని అయిన ఢాకాలోని షేర్‌ బంగ్లా నేషనల్‌ స్టేడియంలో తొలి వన్డే ఉదయం 11:30 గంటలకు మ్యాచ్‌..

1 / 9
భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో తన పర్యటనలో భాగంగా ఈ రోజు(ఆదివారం) మొదటి వన్డే మ్యాచ్‌ను ఆడబోతోంది. ఈ మేరకు బంగ్లా రాజధాని అయిన ఢాకాలోని షేర్‌ బంగ్లా నేషనల్‌ స్టేడియంలో తొలి వన్డే ఉదయం 11:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇందుకోసం టీమిండియా ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

2 / 9
ఆదివారం జరగబోయే మొదటి వన్డే మ్యా్చ్ కోసం వెటరన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ జట్టులోని యువ ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇంకా కోహ్లీ పక్కనే రజత్ పటీదార్‌ కూడా  ప్రాక్టీస్ చేస్తూ చెమటోడ్చాడు.

3 / 9
ఐపీఎల్‌లో ఆర్‌సీబీ జట్టు తరఫున ఆడుతున్న రజత్ పాటిదార్ బంగ్లాదేశ్‌తో జరిగే తొలి వన్డే మ్యాచ్‌లో ఆడడం ద్వారా అతను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న రజత్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు.

4 / 9
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా బంగ్లాపై గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. ఇంకా వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ కోసం భారత జట్టును నిర్మించడంలో ఈ సిరీస్ సహాయపడుతుంది.

5 / 9
భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ తిరిగి తన స్థానంలోకి వచ్చాడు. అతనితో పాటు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కూడా జట్టులోకి వచ్చారు.

6 / 9
కెప్టెన్ రోహిత్ శర్మకు ప్లేయింగ్ ఎలెవన్‌ను సెలెక్ట్ చేయడం పెద్ద ఆందోళనకరమైన విషయంగా మారింది. ప్రధానంగా ఓపెనర్లు ఎవరనే విషయంలో గందరగోళం నెలకొంది. రోహిత్‌తో జతకట్టేందుకు ముగ్గురు బ్యాట్స్‌మెన్ సిద్ధంగా ఉన్నారు. శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌లలో అతనికి ఎవరు జత కడతారనే విషయంలో ఆసక్తి నెలకొంది.

7 / 9
 మిడిలార్డర్‌లో కూడా విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, రాహుల్ త్రిపాఠి, రజత్ పటీదార్ వంటి అనేక మంది ఆటగాళ్లు ఉన్నారు. వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉన్న ఆల్ రౌండర్లు.

8 / 9
ఎలాంటి అడ్డంకులు ఉండవని తెలుస్తోంది. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ పిచ్‌పై మ్యాచ్‌ జరుగుతుండటంతో ఇరు జట్లకు అంత సులువుగా అయితే ఉండదు.

9 / 9
వాతావరణ నివేదిక ప్రకారం మ్యాచ్ జరిగే రోజు సూర్యరశ్మి ఉంటుందని, అభిమానులు మ్యాచ్ మొత్తం చూసేందుకు 
భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి వన్డే ఉదయం 11:30 గంటలకు ప్రారంభంకాగా, 11 గంటలకు టాస్ జరగనుంది. దీనికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడవచ్చు. ఇంకా సన్ లైన్ యాప్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్‌ను చూడవచ్చు.

వాతావరణ నివేదిక ప్రకారం మ్యాచ్ జరిగే రోజు సూర్యరశ్మి ఉంటుందని, అభిమానులు మ్యాచ్ మొత్తం చూసేందుకు భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి వన్డే ఉదయం 11:30 గంటలకు ప్రారంభంకాగా, 11 గంటలకు టాస్ జరగనుంది. దీనికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడవచ్చు. ఇంకా సన్ లైన్ యాప్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్‌ను చూడవచ్చు.