Virat Kohli: కరోనాపై విరాట్ కోహ్లీ దంపతుల ఉద్యమం.. రూ. 2 కోట్లు విరాళం

Virat Kohli And Anushka Sharma: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న నేపధ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ..

Virat Kohli: కరోనాపై విరాట్ కోహ్లీ దంపతుల ఉద్యమం.. రూ. 2 కోట్లు విరాళం
Virat

Updated on: May 07, 2021 | 12:36 PM

Virat Kohli And Anushka Sharma: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న నేపధ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాపై తాను, అనుష్క శర్మ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు కోహ్లీ తెలిపాడు.

కరోనా కాలంలో కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తామన్న కోహ్లీ.. తమ వంతుగా కెట్టో వెబ్ సైట్ ద్వారా విరాళాల సేకరణ చేయనున్నట్లు చెప్పాడు. అందుకోసం ఓ క్యాంపెయిన్ మొదలు పెడుతున్నామని అన్నాడు. అనుష్క, కోహ్లీ దాదాపు రూ. 7 కోట్ల వరకు కోవిడ్ రిలీఫ్ ఫండ్ రైజింగ్ చేయాలని చూస్తున్నారు.

ఇదిలా ఉంటే వీరిద్దరూ కరోనా బాధితుల సహాయార్ధం రూ. 2 కోట్ల విరాళాన్ని ఇస్తున్నామని చెప్పారు. ఈ మేరకు అనుష్క, కోహ్లీ ట్విట్టర్ ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు. అలాగే ఆరోగ్య వ్యవస్థ ప్రస్తుతం పెను సవాళ్లు ఎదుర్కుంటోంది. మ‌న కోసం వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్స్ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతున్నారని అన్నాడు. వారి కోసం ఇప్పుడు మ‌నం అండ‌గా ఉండాలని పేర్కొన్నాడు. మనందరం కలిసికట్టుగా పోరాడి కరోనాపై విజయం సాధిద్దాం అని అన్నాడు.

ఇవి చదవండి:

ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ లో మార్పులు.. వివరాలివే..

Viral News: గగుర్పొడిచే దృశ్యం.. ఒకే చోట కుప్పలు తెప్పలుగా చేరిన పాములు.. వీడియో వైరల్.!

ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు చిరుతపులి నక్కింది.. అది ఎక్కడ ఉందో కనిపెట్టగలరా.?