Virat Kohli : ఎంఎస్ ధోని తర్వాత విరాట్ అత్యత్తమ కెప్టెన్..! డబ్ల్యుటీసీ ఫైనల్ ఓడిపోవడం అతని తప్పు కాదంటున్న.. : ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుటిసి) ఫైనల్ మ్యాచ్ ఓడిపోయాక టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశ్నల వర్షం కురుస్తుంది. అయితే ఇది సరైన పద్దతి కాదని పాకిస్తాన్ వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్ కమ్రాన్ అక్మల్ అభిప్రాయపడ్డారు. కోహ్లీకి మద్దతు పలుకుతూ అతడు గొప్ప కెప్టెన్ అని కితాబిచ్చాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ పరాజయం, 2019 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ ఓటమి అతడి తప్పు కాదని పేర్కొన్నాడు.
“ఎంఎస్ ధోని తర్వాత విరాట్ కోహ్లీ ఉత్తమ కెప్టెన్. అతనికి 70 (అంతర్జాతీయ) సెంచరీలు ఉన్నాయి. అతను ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 ప్రపంచ కప్ ఆడాడు భారతదేశం ఓడిపోయింది కానీ అతడు చేసిన తప్పు ఏమిటి? అతడి ఐదేళ్ల ఆటను పరిశీలించండి అతని విజయాలు, అతని సేవ, అతని కెప్టెన్సీ అద్భుతమైనది. దాని గురించి ఎటువంటి సందేహం లేదు. అతను అద్భుతమైన ఆటగాడు. తనను తాను మలుచుకున్న తీరు అసాధారణమైనది ” అని అక్మల్ యూట్యూబ్‌లో వీడియో చాట్‌లో పేర్కొన్నాడు.
కోహ్లీని కెప్టెన్‌గా మార్చినట్లయితే భారత్ ఐసిసి టోర్నమెంట్లలో విజయం సాధిస్తుందనే గ్యారంటీ లేదని అక్మల్ అన్నారు. కోహ్లీని ప్రశ్నించిన వారిపై కూడా అక్మల్ ప్రశ్నల వర్షం కురిపించారు. విరాట్ అద్భుతమైన ఆటగాడు, ఇంకా చెప్పాలంటే అద్భుతమైన కెప్టెన్, భారతదేశం కెప్టెన్‌ను మార్చితే ఐసిసి టోర్నమెంట్లను గెలుస్తారని ఎవరైనా హామీ ఇవ్వగలరా అంటూ ప్రశ్నించారు. క్రికెట్ గురించి తెలియనివారు, గల్లీ జట్టుకు కూడా నాయకత్వం వహించని వ్యక్తులు ఇప్పుడు కోహ్లీని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు.