Vaibhav Suryavanshi : బీహార్ నుంచి దుబాయ్ జంప్ అయిన బుడ్డోడు..పాకిస్తాన్‌పై పరుగుల వరద పారించనున్న వైభవ్

Vaibhav Suryavanshi : సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బీహార్ జట్టు తరఫున తన బ్యాట్‌తో పరుగుల వర్షం కురిపించిన యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోయింది. ఈ టోర్నమెంట్‌లో సెంచరీ కూడా సాధించిన వైభవ్, రింకూ సింగ్ సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ జట్టుతో జరిగిన చివరి మ్యాచ్‌లో బీహార్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కనిపించలేదు.

Vaibhav Suryavanshi : బీహార్ నుంచి దుబాయ్ జంప్ అయిన బుడ్డోడు..పాకిస్తాన్‌పై  పరుగుల వరద పారించనున్న వైభవ్
Vaibhav Suryavanshi

Updated on: Dec 08, 2025 | 12:57 PM

Vaibhav Suryavanshi : సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బీహార్ జట్టు తరఫున తన బ్యాట్‌తో పరుగుల వర్షం కురిపించిన యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోయింది. ఈ టోర్నమెంట్‌లో సెంచరీ కూడా సాధించిన వైభవ్, రింకూ సింగ్ సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ జట్టుతో జరిగిన చివరి మ్యాచ్‌లో బీహార్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కనిపించలేదు. అయితే వైభవ్ మ్యాచ్ నుంచి తప్పుకోవడానికి కారణం ఒక గొప్ప మిషన్ అని తెలుస్తోంది. ఆ మిషన్ కోసమే బీహార్ తరపున తన చివరి గ్రూప్ మ్యాచ్‌ను అతను మిస్ చేయాల్సి వచ్చింది.

బీహార్ టీమ్ నుంచి వైభవ్ సూర్యవంశీ బయటకు రావడానికి గల కారణం అండర్-19 ఆసియా కప్ 2025. డిసెంబర్ 12 నుంచి దుబాయ్‌లో ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ ముఖ్యమైన టోర్నమెంట్ కోసం వైభవ్ సూర్యవంశీ భారత అండర్-19 జట్టులోకి ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్‌కు సన్నద్ధం కావడానికి, భారత జట్టుతో కలవడానికి, అలాగే టోర్నమెంట్ కోసం దుబాయ్‌కు బయలుదేరడానికి వైభవ్ ఈ కీలక మ్యాచ్‌ను ఆడలేదని సమాచారం.

వైభవ్ సూర్యవంశీకి ఇది రెండో అండర్-19 ఆసియా కప్ కావడం విశేషం. గత ఏడాది కూడా అతను ఈ టోర్నమెంట్ ఆడాడు. డిసెంబర్ 12, 2025 నుంచి ప్రారంభమయ్యే అండర్-19 ఆసియా కప్‌లో భారత్ తన ప్రచారాన్ని మొదటి రోజునే యూఏఈతో ప్రారంభిస్తుంది. ఆ తర్వాత డిసెంబర్ 14న భారత్, పాకిస్తాన్ మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

గత ఏడాది U19 ఆసియా కప్‌లో వైభవ్ 5 మ్యాచ్‌లలో 12 సిక్సర్లు, 15 ఫోర్లతో 176 పరుగులు సాధించాడు. ఈ టోర్నమెంట్‌తోనే భారత అండర్-19 జట్టులోకి అతను అడుగుపెట్టాడు. గత టోర్నమెంట్ అతనికి ఆశించినంతగా కలిసి రాకపోయినా, ఈసారి మరింత అనుభవం, మెచ్యూరిటీతో వైభవ్ బరిలోకి దిగుతున్నాడు. దీంతో అతను పరుగుల వరద పారించడమే కాకుండా, భారత్‌ను ఛాంపియన్‌గా నిలపడంలో ముఖ్యపాత్ర పోషిస్తాడని అందరూ ఆశిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..