
14 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోన్న యూత్ టెస్ట్ సిరీస్‌లో తన సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే 1991లో చేసిన ఓ రికార్డును బద్దలు కొట్టాడు. యూత్ సిరీస్‌లో భాగంగా మొదట ఇంగ్లాండ్, భారత్ అండర్ 19 జట్ల మధ్య వన్డే సిరీస్ జరిగింది. దీనిని భారత్ అండర్ 19 జట్టు 3-2తో గెలుచుకుంది. ఇందులో వైభవ్ సూర్యవంశీ 143 పరుగుల తుఫాను ఇన్నింగ్స్ ఆడటమే కాదు.. సిరీస్ అంతటికి అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. వన్డేలు పూర్తి కాగానే.. రెండు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ జూలై 11-15 మధ్య బెకెన్‌హామ్‌లో జరిగింది.ఈ మ్యాచ్ డ్రాగా ముగియగా.. ఇందులో వైభవ్ సూర్యవంశీ 34 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.
ఈ మొదటి టెస్ట్ మ్యాచ్‌లో రెండు జట్లు కలిసి 15 సిక్సర్లతో మొత్తం 1497 పరుగులు చేశాయి. ఇదొక రికార్డు కాగా.. భారత్ అండర్ 19 రెండు ఇన్నింగ్స్‌లలోనూ 10 సిక్సర్లతో 748 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 5 సిక్సర్లతో 709 పరుగులు కొట్టింది. ఇక వైభవ్ 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 70 పరుగులు చేశాడు. కాగా, 1991లో చెల్మ్స్‌ఫోర్డ్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన యూత్ టెస్ట్ మ్యాచ్‌లో 1430 పరుగులు నమోదు కాగా.. ఆ రికార్డును భారత్, ఇంగ్లాండ్ అండర్ 19 జట్లు 1497 పరుగులు సాధించి 34 ఏళ్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అండర్ 19 జట్టు యూత్ టెస్ట్‌లలో అత్యధిక పరుగులు చేసి టాప్ 5 మ్యాచ్‌లలోని ప్రతి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ భాగం అయింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..