వైభవ్ vs శాంసన్.. ప్లేయింగ్ XIలో అసలు చోటు ఎవరికి దక్కాలి..? లెక్కలు ఏం చెబుతున్నాయంటే..!

Vaibhav Sooryavanshi vs Sanju Samson: ప్రస్తుతం భారత జట్టులో ఓపెనింగ్ స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ ల మధ్య నువ్వా, నేనా అన్న పోటీ కొనసాగుతోంది. అసలు ఈ ఇద్దరి గణాంకాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..!

వైభవ్ vs శాంసన్.. ప్లేయింగ్ XIలో అసలు చోటు ఎవరికి దక్కాలి..? లెక్కలు ఏం చెబుతున్నాయంటే..!
Shreyas Iyer Comments On Vaibhav Sooryavanshi

Updated on: Oct 19, 2026 | 12:12 PM

Vaibhav Sooryavanshi vs Sanju Samson: ఐపీఎల్ 2025లో ఒకే జట్టుకు ఆడిన వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ ఇప్పుడు టీమిండియాలో ప్లేయింగ్ XIలో చోటు కోసం పోటీ పడుతున్న ఆటగాళ్లుగా మారారు. ఇంగ్లండ్ పర్యటనలో వైభవ్‌కు అరంగేట్రం చేసే అవకాశం వచ్చినప్పుడు సంజూ జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఐదో మ్యాచ్‌లో సంజూ తిరిగి జట్టులోకి రాగా, వైభవ్‌కు అవకాశం రాలేదు. జింబాబ్వే పర్యటనలో వైభవ్‌కు చోటు దక్కిన సమయంలో సంజూ ఎంపిక కాలేదు.

అయితే ఆఫ్ఘనిస్థాన్ సిరీస్ నుంచి ఈ ఇద్దరూ మరోసారి భారత జట్టు స్క్వాడ్‌లో కలిసి కనిపిస్తున్నారు. కానీ తుది జట్టులో ఎక్కువ అవకాశాలు సంజూ శాంసన్‌కే లభిస్తున్నాయి. వైభవ్ సూర్యవంశీ మాత్రం వరుసగా బెంచ్‌కే పరిమితమవుతున్నాడు. ఆఫ్ఘనిస్థాన్ తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ అతడికి ప్లేయింగ్ XIలో చోటు దక్కలేదు.

వైభవ్ vs సంజూ.. ఒకేసారి ప్లేయింగ్ XIలో ఎందుకు కుదరడం లేదు?

ఈ పరిస్థితితో వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ మధ్య ఎవరికి తుది జట్టులో అవకాశం ఇవ్వాలనే చర్చ మరింత పెరిగింది. కొందరు అభిమానులు వైభవ్‌కు అవకాశం ఇవ్వాలని అంటుండగా.. మరికొందరు సంజూ శాంసన్‌కు మద్దతు ఇస్తున్నారు. మరి గణాంకాల ప్రకారం ఈ ఇద్దరిలో ఎవరు ముందున్నారు?

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: జస్ట్ 6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. యూవీ 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్..

15 ఏళ్ల వైభవ్ ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా టీ20 మ్యాచ్‌లు ఆడలేదు. అతడు 8 టీ20 మ్యాచ్‌ల్లో 30.75 సగటుతో 186.36 స్ట్రైక్ రేట్‌తో 246 పరుగులు చేశాడు.

సంజూ శాంసన్ విషయానికి వస్తే.. అతడు 77 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 27.10 సగటుతో 1,735 పరుగులు సాధించాడు. వైభవ్ అంతర్జాతీయ మ్యాచ్‌ల అనుభవం చాలా తక్కువగా ఉండటంతో, ఇద్దరినీ పోల్చడానికి మొత్తం టీ20 క్రికెట్ గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

టీ20ల్లో ఎవరి రికార్డు మెరుగ్గా ఉంది?

ఎడమచేతి వాటం బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ కలిపి ఇప్పటివరకు 42 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ 42 ఇన్నింగ్స్‌ల్లో 42.02 సగటుతో 1,723 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 214.83గా ఉంది. ఇందులో 4 సెంచరీలు, 8 అర్ధసెంచరీలు ఉన్నాయి.

వైభవ్ సూర్యవంశీ సంజూ శాంసన్
మొత్తం మ్యాచ్‌లు 42 359
ఇన్నింగ్స్‌లు 42 342
మొత్తం పరుగులు 1,723 9,213
బ్యాటింగ్ సగటు 42.02 30.50
స్ట్రైక్ రేట్ 214.83 140.67
సెంచరీలు 4 8
అర్ధసెంచరీలు 8 59

మరోవైపు సంజూ శాంసన్‌కు టీ20 క్రికెట్‌లో భారీ అనుభవం ఉంది. అతడు ఇప్పటివరకు 359 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 342 ఇన్నింగ్స్‌ల్లో 9,213 పరుగులు సాధించాడు. అతడి బ్యాటింగ్ సగటు 30.50 కాగా, స్ట్రైక్ రేట్ 140.67గా ఉంది. కుడిచేతి వాటం బ్యాటర్ సంజూ ఖాతాలో 8 సెంచరీలు, 59 అర్ధసెంచరీలు ఉన్నాయి.

ప్లేయింగ్ XIలో ఎవరికి చోటు దక్కాలి?

టీ20 క్రికెట్ గణాంకాలను పరిశీలిస్తే.. మొత్తం పరుగుల విషయంలో సంజూ శాంసన్ స్పష్టంగా ముందున్నాడు. అయితే మ్యాచ్‌ల సంఖ్యలో భారీ తేడా ఉన్న కారణంగా ఈ విషయంలో నేరుగా పోలిక పెట్టడం సరైనది కాదు. సగటు, స్ట్రైక్ రేట్ విషయంలో మాత్రం వైభవ్ సూర్యవంశీ సంజూ కంటే మెరుగైన గణాంకాలను కలిగి ఉన్నాడు.

ఎక్కువమంది చదివినది: తొలి రెండు బంతుల్లో రెండు వికెట్లు.. ప్రపంచ రికార్డ్ నే షేక్ చేసిన టీమిండియా నయా సెన్సేషన్..!

వైభవ్ ఇప్పటివరకు 50 టీ20 మ్యాచ్‌లు కూడా పూర్తి చేయలేదు. మరోవైపు సంజూ 359 మ్యాచ్‌ల అనుభవంతో ఎంతో సీనియర్. ఇద్దరి మధ్య మ్యాచ్‌ల సంఖ్యలోనే 300కు పైగా తేడా ఉంది.

సంజూ దాదాపు అన్ని స్థాయిల్లో, ఎన్నో జట్లపై ఆడిన అనుభవం సంపాదించాడు. వైభవ్ మాత్రం ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా సంజూ శాంసన్‌పై నమ్మకం కొనసాగించడం సమంజసం. ప్లేయింగ్ XIలో అతడికి చోటు ఇవ్వడం సరైన నిర్ణయంగా కనిపిస్తోంది. వైభవ్‌ను బ్యాకప్ ఆప్షన్‌గా కొనసాగిస్తూ, అతడికి సరైన సమయంలో అవకాశాలు ఇవ్వడం ఉపయోగకరంగా ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us