డెబ్యూ లేకుండానే ఇంగ్లాండ్ సిరీస్ నుంచి వైభవ్ సూర్యవంశీ ఔట్.. కోచ్ సంచలన వ్యాఖ్యలు..!

Vaibhav Sooryavanshi debut: సంచలన ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మేనేజ్మెంట్ సీనియర్లపై నమ్మకం ఉంచడాన్ని కొందరు సమర్థిస్తుంటే, ఫామ్‌లో లేని ఆటగాళ్ల స్థానంలో యువ రక్తాన్ని ఎందుకు పరీక్షించకూడదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా, ఈ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ మైదానంలోకి అడుగుపెట్టాలంటే మరికొన్ని రోజులు నిరీక్షించక తప్పేలా లేదు.

డెబ్యూ లేకుండానే ఇంగ్లాండ్ సిరీస్ నుంచి వైభవ్ సూర్యవంశీ ఔట్.. కోచ్ సంచలన వ్యాఖ్యలు..!
Ind Vs Eng Vaibhav Sooryavanshi Debut
Image Credit source: X.com

Updated on: Jul 04, 2026 | 5:25 PM

Vaibhav Sooryavanshi Debut: ఐపీఎల్ 2026లో తన అద్భుత ప్రదర్శనతో టీమిండియాలో చోటు దక్కించుకున్న 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లోనైనా ఈ యువ ఆటగాడికి అవకాశం దక్కుతుందని ఆశించిన అభిమానులకు, టీమిండియా కోచింగ్ స్టాఫ్ చేసిన తాజా ప్రకటన తీవ్ర నిరాశను మిగిల్చింది.

ఐపీఎల్ స్టార్‌కు దక్కని చోటు.. నిరీక్షణలో యువ సంచలనం..

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా జట్టులోకి దూసుకొచ్చిన ఎడమచేతి వాటం ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఎప్పుడు బరిలోకి దిగుతాడా అని గత రెండు వారాలుగా యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐర్లాండ్ పర్యటనలోనే ఈ యువ ఆటగాడు బరిలోకి దిగుతాడని అందరూ భావించినప్పటికీ, మేనేజ్మెంట్ అతడిని బెంచ్‌కే పరిమితం చేసింది. వరుసగా విఫలమవుతున్న సీనియర్లకు ఇస్తున్న అవకాశాలు చూస్తుంటే, ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో అసలు వైభవ్‌కు ఆడే అవకాశం వస్తుందా లేదా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై మౌనం వీడిన టీమిండియా కోచ్.. ఎందుకు అవకాశం ఇవ్వడం లేదంటే?

ఇవి కూడా చదవండి

సంజూ శాంసన్‌కు అండగా మేనేజ్మెంట్.. వైభవ్‌కు నిరాశేనా..?

గత కొన్ని మ్యాచ్‌లుగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ వరుసగా ఫ్లాప్ అవుతుండటంతో, ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టీ20లోనే వైభవ్ సూర్యవంశీ జట్టులోకి వస్తాడని జోరుగా ప్రచారం సాగింది. సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి వంటి దిగ్గజాలు సైతం వైభవ్‌ను జట్టులోకి తీసుకోవాలని బహిరంగంగానే డిమాండ్ చేశారు. అయినప్పటికీ, మేనేజ్మెంట్ మాత్రం శాంసన్‌కే మరోసారి ఓటు వేసింది. కనీసం రాబోయే మ్యాచ్‌ల్లోనైనా ఈ 15 ఏళ్ల కుర్రాడికి అవకాశం ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నా, కోచ్ మాటలు వింటే ఆ ఛాన్స్ అస్సలు లేనట్లే కనిపిస్తోంది.

సీనియర్ల కోసం యువ ఆటగాడి త్యాగం.. స్పష్టం చేసిన మోర్నే మోర్కెల్..

ఇంగ్లాండ్‌తో జరగబోయే రెండో టీ20 మ్యాచ్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జట్టులోని ప్రధాన ఓపెనర్లకు మరికొంత కాలం అండగా నిలవాలని మేనేజ్మెంట్ భావిస్తోందని స్పష్టం చేశాడు.

ఇది కూడా చదవండి: వాడిపనైపోయింది, ఇక ఆడలేడు.. ఇప్పటికైనా అతడిని రంగంలోకి దింపడయ్యా సామీ..!

“ప్రస్తుతం జట్టులో ఉన్న నంబర్ వన్ బ్యాటర్ల ఆటను మనం గౌరవించాలి. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ప్రపంచకప్‌లోనూ, ఐపీఎల్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఒక కోచింగ్ స్టాఫ్‌గా మా ఆటగాళ్లపై నమ్మకం ఉంచడం, వారికి మద్దతుగా నిలవడం మా బాధ్యత. వైభవ్ లాంటి యువ ఆటగాడు జట్టులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉండటం శుభపరిణామమే, కానీ ప్రస్తుతం ఆడుతున్న టాప్ ఆర్డర్ ఆటగాళ్లకు మేము అండగా ఉన్నామనే నమ్మకాన్ని కల్పించడం జట్టు వాతావరణానికి చాలా ముఖ్యం” అని మోర్కెల్ వ్యాఖ్యానించాడు.

నెట్స్‌లో అదరగొడుతున్నా.. నిరీక్షించక తప్పదు..!

మోర్కెల్ వ్యాఖ్యలతో వైభవ్ అరంగేట్రం ఆలస్యం అవుతుందని తేలిపోయినప్పటికీ, ఈ యువ ఆటగాడి ప్రతిభను ఆయన కొనియాడాడు. కేవలం 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ స్థాయి నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొనడం అంత సులువు కాదని, కానీ వైభవ్ ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తున్నాడని తెలిపాడు. జట్టులోని సీనియర్ ఆటగాళ్లు కూడా అతడిని ఎంతో బాగా ఆదరించారని, అవకాశం వచ్చినప్పుడు వైభవ్ ఖచ్చితంగా సత్తా చాటుతాడని మోర్కెల్ ధీమా వ్యక్తం చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us