శ్రీలంకలోనే 2024 ప్రపంచ కప్.. 2027లో 14 జట్లతో వన్డే వరల్డ్ కప్ సమరం.. పూర్తి జాబితా ఇదే..

|

Nov 15, 2022 | 9:42 PM

2024 నుంచి 2027 మధ్య జరిగే అండర్-19 ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిచ్చే దేశాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. 2026 హోస్టింగ్ జింబాబ్వే, నమీబియాకు సంయుక్తంగా కేటాయించింది.

శ్రీలంకలోనే 2024 ప్రపంచ కప్.. 2027లో 14 జట్లతో వన్డే వరల్డ్ కప్ సమరం.. పూర్తి జాబితా ఇదే..
U19 Wolrd Cup
Follow us on

2024 అండర్-19 పురుషుల ప్రపంచకప్ శ్రీలంకలో జరగనుంది. 2024 నుంచి 2027 మధ్య జరిగే అండర్-19 ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిచ్చే దేశాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. 2026 హోస్టింగ్ జింబాబ్వే, నమీబియాకు సంయుక్తంగా కేటాయించింది. 2025 అండర్-19 మహిళల ప్రపంచకప్‌ను మలేషియా, థాయ్‌లాండ్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. కాగా 2027లో జరగనున్న ప్రపంచకప్‌ బాధ్యతలను బంగ్లాదేశ్‌, నేపాల్‌లకు సంయుక్తంగా అప్పగించారు.

2027 వన్డే ప్రపంచకప్‌కు జట్లు ఎలా అర్హత సాధిస్తాయంటే..

2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వేలో జరగనున్న ప్రపంచకప్‌నకు ఐసీసీ అర్హతను స్పష్టం చేసింది. ఈ ప్రపంచకప్‌లో 14 జట్లు పాల్గొంటాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఆతిథ్య దేశాలైనందున నేరుగా అర్హత సాధిస్తాయి. ఆ సమయంలో వన్డే ప్రపంచ ర్యాంకింగ్ ఆధారంగా 8 జట్లు అర్హత సాధిస్తాయి. అదే సమయంలో ఐసీసీ గ్లోబల్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ కింద 4 జట్లను ఎంపిక చేస్తారు.

2024 మహిళల T20 ప్రపంచ కప్‌లో 10 జట్లు

2024 మహిళల T20 ప్రపంచ కప్‌నకు జట్ల అర్హతను కూడా ICC ప్రకటించింది. ఈ ప్రపంచకప్‌లో 10 జట్లు ఆడనున్నాయి. వీటిలో 8 జట్లు 27 ఫిబ్రవరి 2023 నాటికి ప్రపంచ ర్యాంకింగ్ ఆధారంగా నేరుగా అర్హత సాధిస్తాయి. ఐసీసీ గ్లోబల్ క్వాలిఫైయర్ ఆధారంగా 2 జట్లను ఎంపిక చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..