క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఫలితాలనుంచి గాయాల వరకు ఎవరూ ఏం చెప్పలేని పరిస్థితి. వీటీకి సంబంధించిన ఏన్నో వీడియోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో నెట్టింట్లో తిరుగుతోంది. అయితే, ఈ మ్యాచ్‌లో బలైంది ఆటగాడు మాత్రం కాదు. అంపైర్ బ్రూస్ ఆక్సెన్‌ఫోర్డ్ ఓ మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. ఆస్ట్రేలియాలో జరుగుతున్న వన్డే టోర్నీలో క్వీన్స్‌లాండ్, సౌత్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్ కొట్టిన షాట్ నేరుగా లెగ్ అంపైర్ మోకాలికి తగిలింది. గాయం తీవ్రంగా ఉండటంతో వెంటనే మైదానం నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆక్సెన్‌ఫోర్డ్ స్థానంలో థర్డ్ అంపైర్ డోనవన్ కోచ్‌ని మైదానంలోకి పిలిచారు.
ఆస్ట్రేలియా మీడియా నివేదికల ప్రకారం, 62 ఏళ్ల అంపైర్ బ్రూస్ ఆక్సెన్‌ఫోర్డ్ మోకాలికి తీవ్ర గాయమైంది. అతన్ని ఆసుపత్రికి తరలించారు. బ్రూస్ ఆక్సెన్‌ఫోర్డ్ తన చేతుల్లో వింత షీల్డ్ ధరించి అంపైరింగ్ చేసిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. IPL 2016 అంటే 9వ ఎడిషన్‌లో అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ భద్రతా పరికరంతో అపైరింగ్ చేశాడు. ఇది గాయాల నుంచి రక్షించడానికి రూపొందించారు. ఈ మ్యాచ్‌లో ప్రయోగాత్మకంగా ఆనిని ధరించారు.
Wishing umpire Bruce Oxenford a speedy recovery.
He’s been replaced by third umpire Donovan Koch after this nasty blow on the knee #MarshCup #QLDvSA pic.twitter.com/Orkvvl2ogo
— cricket.com.au (@cricketcomau) September 26, 2022
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. దీంతో క్వీన్స్‌లాండ్ 217 పరుగులకే కుప్పకూలింది. జట్టు 50 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. 47వ ఓవర్‌లోనే ఆట ముగిసింది.