Umesh Yadav In IPL 2022: ‘చివరి బంతి పడేంత వరకు ఆట ముగించకూడదు’ అని క్రికెట్‌లో ఒక సామెత ఉంది. ఇది టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్‌కు సరిగ్గా సరిపోతుంది. 34 ఏళ్ల ఈ స్పీడ్‌స్టర్‌కు క్రికెట్‌లో ఎంతో దశాబ్దానికిపైగా అనుభవం ఉంటుంది. పేస్ కు తోడు అద్భుతమైన బౌన్స్‌తో కూడిన స్వింగ్ బౌలింగ్‌తో బ్యాటర్లును ముప్పతిప్పలు పెట్టే ఈ బౌలర్ టీమిండియా క్రికెట్లో బలమైన ముద్ర వేసుకున్నాడు. వన్డే, టెస్టుల్లో రెగ్యులర్ సభ్యుడిగా మారిపోయాడు. అయితే గత కొన్నేళ్లుగా అతని ఆటతీరు మసకబారింది. నిలకడ లేమికి తోడు గాయాలు ఇబ్బంది పెట్టడంతో గత కొన్నేళ్లుగా వరుస వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. వీటికి తోడు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి కొత్త ఫాస్ట్ బౌలర్లు రావడంతో ఉమేశ్‌కు జట్టులో చోటు ప్రశ్నార్థకమైంది. . టీమిండియాలోనే కాదు ఇండియన్ ప్రీమియర్‌లీగ్‌లోనూ గత కొన్నేళ్లుగా రిజర్వ్ బెంచ్‌కే పరిమితమవుతూ వస్తున్నాడు. కీలక బౌలర్లు గాయపడినప్పుడు మాత్రమే తుది జట్టులో చోటు దక్కించుకుంటున్నాడు.
మెగావేలంలోనూ మొండి చెయ్యే..
ఇక ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఐపీఎల్ ప్రస్థానాన్ని ఆరంభించిన ఉమేష్.. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారిపోయాడు. 2018లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జెర్సీతో బరిలోకి 20 వికెట్లు కూడా తీసుకున్నాడు. అయితే ఆతర్వాతి ఏడాది నుంచే అతనికి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. 2020 సీజన్ లో కేవలం రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ అతనిని కేవలం రూ. 1 కోటి బేస్ ధరకు కొనుగోలు చేసింది. అయితే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే తుది జట్టులో దక్కించుకున్నాడు. అలా 2020, 2021లో కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు ఉమేశ్. ఈ కారణంతోనే ఐపీఎల్ 2022 ఆరంభానికి ముందు జరిగిన మెగావేలంలో ఉమేశ్‌ను కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. తొలి రెండు రౌండ్లలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిన ఉమేశ్ యాదవ్‌ను.. మూడో రౌండ్‌లో కేకేఆర్ కేకేఆర్ కొనుగోలు చేసింది.
టీ20 ప్రపంచకప్‌లో ఛాన్స్!
అలా అందివచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు ఉమేశ్. పాట్ కమిన్స్, టిమ్ సౌతీ వంటి దిగ్గజ విదేశీ బౌలర్లు లేకుండానే మొదటి మ్యాచ్‌లోకి బరిలోకి దిగిన కేకేఆర్ డిపెండింగ్ ఛాంపియన్ చెన్నైను మట్టికరిపించిందంటే అది ఉమేశ్ చలువే. ఆమ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన ఈ స్పీడ్‌స్టర్..ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీతో సహా మరో 2 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌పై కేవలం 23 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. కాగా ఇప్పటివరకు 3 మ్యాచ్‌లలో 8 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు ఉమేశ్. అంతేకాదు 3 మ్యాచ్ ల్లో ఏకంగా 2 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందకున్నాడు. తద్వారా 10 సార్లు ఈ ఘనత అందుకున్న ఏకైక బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కడు. ఇక ఐపీఎల్‌లో పవర్‌ప్లేలో 50 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. కాగా మొత్తానికి గ్రేట్‌కమ్‌బ్యాక్ ఇచ్చిన ఉమేశ్ యాదవ్ తన ఫామ్‌ను ఇలాగే కంటిన్యూ చేస్తే రానున్న ఆర్నెళ్లలో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2022కు ఎంపికవ్వొచ్చని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.
Also Read:Pranay Murder case: ప్రణయ్ హత్య కేసు నిందితుడు అబ్దుల్ బారీకి గుండెపోటు.. నిమ్స్ ఆస్పత్రికి తరలింపు
Hyderabad crime: అనుమానమే పెనుభూతమైంది.. కన్న కొడుకు కళ్లెదుటే.. దారుణానికి పాల్పడిన తండ్రి
Viral Video: అయ్యా..! చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిన 200 మంది.. వీడియో చుస్తే షాక్ అవుతారు..