- Telugu News Photo Gallery IPL 2022: Umesh Yadav break Rohit Sharma and Chris Gayle Record of Most Man Of The Match
IPL 2022: పంజాబ్ జట్టంటే ఉమేశ్ కు ఎందుకంత ప్రేమ? ఏకంగా రోహిత్, గేల్‌ల రికార్డులను బద్దలు కొట్టిన స్పీడ్‌స్టర్..
Umesh Yadav IPL 2022: పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్లు తీసిన ఉమేశ్ ఐపీఎల్‌లో రోహిత్ శర్మ, క్రిస్ గేల్ వంటి స్టార్ల రికార్డును తుడిచేశాడు
Updated on: Apr 02, 2022 | 8:33 AM

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉమేష్ యాదవ్ ఆరోసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. తద్వారా రోహిత్, గేల్, యూసుఫ్ పఠాన్‌ల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఏదైనా ఒక ఐపీఎల్ జట్టుపై 5 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం గెల్చుకున్నారు.

ఈ ముగ్గురు ఆటగాళ్ల రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా ఉమేష్ యాదవ్ మరో రికార్డు సృష్టించాడు. అదేంటంటే.. ఐపీఎల్‌లో10 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైన ఏకైక పేసర్. పంజాబ్ కింగ్స్‌పై 4 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవడం ఉమేశ్‌కు పదోసారి.

IPL 2022 సీజన్లో కేకేఆర్ బౌలర్ ఉమేష్ యాదవ్ నిలకడగా రాణిస్తున్నాడు. ఒక్కో మ్యాచ్‌తో ఒక సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంటున్నాడు. అందులో భాగంగానే పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్లు తీసి రోహిత్ శర్మ, క్రిస్ గేల్ వంటి IPL స్టార్ల రికార్డును అధిగమించాడు.

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికవ్వడం ద్వారా ఐపీఎల్‌లో ఏదైనా ఒక ప్రత్యర్థి జట్టుతో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులకు ఎంపికైన ఆటగాడిగా ఉమేష్ యాదవ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ విషయంలో అతను రోహిత్ శర్మ, క్రిస్ గేల్, యూసుఫ్ పఠాన్‌లను అధిగమించాడు.

గతంలో రోహిత్ శర్మ KKRపై 5 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకోగా.. క్రిస్ గేల్ KKRపై 5 సార్లు, యూసుఫ్ పఠాన్ డెక్కన్ ఛార్జర్స్‌పై 5 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచారు.

పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ద్వారా ఒక జట్టుపై అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఆటగాడిగా ఉమేశ్ రికార్డు సృష్టించాడు.




