U19 World Cup 2022: సెమీ ఫైనల్‌లో భారత్‌కి టఫ్ పోరు.. ఎవరితో తలపడనుందో పూర్తి షెడ్యూల్‌ తెలుసుకోండి..?

|

Jan 30, 2022 | 7:52 AM

U19 World Cup 2022: U19 ప్రపంచ కప్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన చివరి

U19 World Cup 2022: సెమీ ఫైనల్‌లో భారత్‌కి టఫ్ పోరు.. ఎవరితో తలపడనుందో పూర్తి   షెడ్యూల్‌ తెలుసుకోండి..?
U19 World Cup
Follow us on

U19 World Cup 2022: U19 ప్రపంచ కప్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది.
భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన చివరి క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌తో టోర్నమెంట్‌లోని మొదటి
నాలుగు జట్లు తెలిసిపోయాయి. అంటే ఇప్పుడు ఈ నాలుగు టీమ్‌లు ఫైనల్ కోసం పోరాడుతాయి.
సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టిన నాలుగు జట్లలో ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, భారత్‌లు
ఉన్నాయి. ఈ నాలుగు జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో అఫ్గానిస్థాన్ ఆటతీరు ఆశ్చర్యంగా
ఉంది. ఈ ఆసియా దేశం అంచనాలను మించి టోర్నీలో చివరి 4లో తన స్థానాన్ని ఖాయం
చేసుకుంది.

టోర్నీ చివరి క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను భారత్ సులభంగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో
బంగ్లాదేశ్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి భారత జట్టుకు అవకాశం లభించింది. నిజానికి,
బంగ్లాదేశ్ జట్టు గతసారి భారత్‌ను ఓడించి తొలిసారి అండర్ 19 ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా
నిలిచింది. క్వార్టర్ ఫైనల్లో భారత్‌తో పాటు దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ విజయం సాధించింది.
ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంకను ఆశ్చర్యపరిచింది. ఆస్ట్రేలియా పాకిస్తాన్‌ను ఓడించింది.

సెమీ ఫైనల్స్‌లో ఎవరు పోటీపడతారు?

అండర్ 19 ప్రపంచకప్‌లో టాప్-4 జట్ల మధ్య ఇప్పుడు సెమీఫైనల్ పోరు జరగనుంది. మరి
ఇలాంటప్పుడు ఫైనల్‌ టికెట్‌ కోసం ఏ జట్టు ఎవరితో తలపడబోతుందో తెలియాల్సి ఉంది. భారత్
ఎవరితో పోటీపడుతుంది? టోర్నీ తొలి సెమీఫైనల్ ఫిబ్రవరి 1న జరగనుంది. కాగా రెండో
సెమీఫైనల్ ఫిబ్రవరి 2న జరగనుంది.

ఇంగ్లండ్ vs ఆఫ్ఘనిస్తాన్, మొదటి సెమీ-ఫైనల్

తొలి సెమీస్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో ఇంగ్లండ్ తలపడనుంది. సవాలు సులభం. అయితే క్వార్టర్ ఫైనల్లో
శ్రీలంకను ఆఫ్ఘనిస్థాన్ ఓడించిన తీరు అద్భుతం. ఆఫ్ఘన్‌లను తేలికగా తీసుకోవడానికి ఇంగ్లీష్
జట్టుకి అవకాశం లేదు.

భారత్ vs ఆస్ట్రేలియా, రెండో సెమీ ఫైనల్

రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. దీంతో గట్టి పోటీ ఉంటుంది. ఫైనల్‌కు
ముందు ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టైటిల్‌కు గట్టి
పోటీనిస్తుంది. సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడక ముందు వార్మప్ మ్యాచ్‌లో గెలిచింది. ఇది
భారత్‌కి కలిసివచ్చే అవకాశం ఉంది.

Ayurveda: ఆయుర్వేదం ప్రకారం భోజన నియమాలు మీకు తెలుసా..?

IGNOU: సంస్కృతం, ఉర్దూలో గ్రాడ్యుయేషన్ కోర్సు ప్రారంభించిన ఇగ్నో.. అడ్మిషన్లు స్టార్ట్..

IND vs WI: T20 సిరీస్‌కి జట్టుని ప్రకటించిన వెస్టిండీస్‌.. 16 మంది ఆటగాళ్ల ఎంపిక..